పవర్ స్టార్ అనగానే గుర్తుకు వచ్చేది ఎవరంటే పవన్ కళ్యాణ్.ఈమద్య కాలంలో సాయి పల్లవి కూడా గుర్తుకు వస్తుంది.
ఎందుకంటే ఆమెను లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి అంటూ పిలుస్తున్నారు.తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఆమెకు లేడీ పవర్ స్టార్ బిరుదు ఇచ్చేశారు.
హీరోయిన్ గా ఆమె చేస్తున్న సినిమాలు తక్కువే అయినా కూడా ప్రతి పాత్రకు కూడా అద్బుతమైన తన నటన జోడించి సినిమా ను రక్తి కట్టిస్తున్న విషయం తెల్సిందే.దేశ వ్యాప్తంగా కూడా సాయి పల్లవికి మంచి పేరు వచ్చింది.
పాన్ ఇండియా హీరోయిన్ గా సాయి పల్లవి గుర్తింపు దక్కించుకుంది.ఈ సమయంలో ఆమె నటించిన విరాటపర్వం సినిమా విడుదల అయ్యింది.
విరాటపర్వం సినిమా సాయి పల్లవి ఉండటం వల్ల భారీ మొత్తాలకు కొనుగోలు చేయడం జరిగింది.
ఆ సినిమా మొత్తం గా 12 కోట్ల రూపాయల బిజినెస్ చేయగా కనీసం మూడు కోట్ల వసూళ్లు కూడా రాబట్టలేక పోయింది.
దాంతో సాయి పల్లవి క్రేజ్ ఏమైంది అంటూ అంతా కూడా ముక్కున వేలేసుకున్నారు.ఇంతకు విరాటపర్వం ఆ స్తాయి డిజాస్టర్ గా నిలిచిన నేపథ్యంలో సాయి పల్లవి కి అభిమానులు ఇచ్చిన లేడీ పవర్ స్టార్ ట్యాగ్ లైన్ ఉందా లేదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి వెన్నెల పాత్ర కు కమిట్ అవ్వడం అనేది సాయి పల్లవి కెరీర్ లో చేసిన అతి పెద్ద తప్పు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్ చేస్తున్నారు.తెలుగు లో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా సాయి పల్లవికి మంచి క్రేజ్ ఉంది కనుక కమర్షియల్ పాత్రలు చేస్తే మూడు నుండి అయిదు కోట్ల వరకు ఈమెకు పారితోషికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.








