వామ్మో.. అమ్మాయిల అరాచకానికి అంతులేకుండా పోతోందిగా.. జుట్టు రాలుతోందని ఉరేసుకుందట!

ఈ మధ్య కాలంలో చాలా మంది యువతీ యువకులు చిన్న చిన్న విషయాలకే డిప్రెషన్ లోకి వెళ్లడం, ఆపై ఆత్మహత్యలు చేసుకోవడం మనం తరచుగా చూస్తూనే ఉన్నాం.అయితే అలాంటి ఘటనే జరిగింది కర్ణాటకలో.

 Young Girl Committed Suicide For Hair Losing Problems At Karnataka Young Girl ,-TeluguStop.com

అదేంటో తెలిస్తే.మీరూ నోరెళ్లబడతారు మరి.అయితే కర్ణాటకలోని మైసూర్ కు చెందిన ఓ యువతికి తరచుగా జుట్టు రాలుతోంది.జుట్టు రాలే సమస్యతో మనస్తాపం చెందిన ఆ అమ్మాయి ఏకంగా ప్రాణాలే తీసేస్కుంది.మృతురాలిని 21 ఏళ్ల కావ్య శ్రీగా గుర్తించారు.రాఘవేంద్ర ఎక్స్ టెన్షన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

అయితే కావ్య గత కొద్ది రోజులుగా హెయిర్ ఫఆల్ సమస్యతో బాధపడుతోంది.ఎన్నెన్నో షాంపూలు, హెయిర్ కండీషనర్ లు, హెయిర్ డైలు, స్ప్రేలు ఇలా చాలానే వాడింది.

అయిప్పటికీ ఎలాంటి ఫలితం లేదు.క్రమక్రంగా జుట్టు మొత్తం ఊడిపోయింది.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కావ్య… ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకొని చనిపోయింది.కుటుంబ సభ్యులు ఇంటికొచ్చాక విషయం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

హుటాహుటిన రంగంలోకి దిగిన వాళ్లు ఘటనా స్థలానికి చేరుకున్నారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అయితే కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం ఆమె జుట్టు రాలే సమస్య వల్లే చాలా సమస్యలు ఎదుర్కుంటుందని… దాని వల్లే ప్రాణాలు తీస్కుందని చెబుతున్నారు.దీని గురించి ఆమెకు కౌన్సిలింగ్ ఇప్పించినప్పటికీ ఎలాంటి ఫలితం లేదని… కేవలం జుట్టు కోసం తమ బిడ్డ తమకు దూరమవడం చాలా కష్టంగా ఉందంటూ కన్నీరుమున్నీరవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube