మూడోసారి ప్రేమలో ఓడిపోయిన బిగ్ బాస్ రన్నర్ అఖిల్ సార్థక్.. నెటిజన్స్ ట్రోలింగ్!

బిగ్ బాస్ కంటెస్టెంట్ అఖిల్ సార్థక్ గురించి మనందరికీ తెలిసిందే.బిగ్ బాస్ సీజన్ 4 లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి చివరికి రన్నరప్ గా నిలిచిన విషయం తెలిసిందే.

 Bigg Boss Fame Akhil Sarthak Another Breakup Story Revealed , Bigg Boss, Akhil S-TeluguStop.com

అయితే బిగ్ బాస్ హౌస్ కి రాకముందు వరకు ఎవరు అన్నది చాలామందికి తెలియదు.బిగ్ బాస్ షో ఒక్కసారిగా భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు అఖిల్ సార్ధక్.

ఇటీవల ముగిసిన బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో కూడా పాల్గొని రన్నరప్ గా నిలిచిన విషయం తెలిసిందే.రెండుసార్లు కూడా విజయానికి ఒక్క అడుగు దూరంలో ఉండగా మిస్ అయిపోయాడు.

అయితే అఖిల్ సార్ధకు బాగా పాపులర్ అవ్వడానికి ఒకటి బిగ్ బాస్ షో కాగా మరొకటి మోనాల్ గజ్జర్ అని చెప్పవచ్చు.

మోనాల్ అఖిల్ ఇద్దరూ బిగ్ బాస్ హౌస్ చేసిన రచ్చ గురించి మనందరికీ తెలిసిందే.

మొదట్లో అభిజిత్ ని ఇష్టపడ్డ మోనాల్ ఆ తర్వాత అఖిల్ తో కనెక్ట్ అయింది.బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కొద్ది రోజులు వీరి లవ్ ట్రాక్ స్పీడ్ తో ముందుకు తీసుకుపోతూనే వెబ్ సిరీస్ లలో నటించడం కూడా మొదలుపెట్టారు.

ఆ తరువాత అఖిల్ బిగ్ బాస్ ఓటిటీ కి వచ్చిన తర్వాత మోనాల్ పేరు వినిపించలేదు.ఇది ఇలా ఉంటే తాజాగా అఖిల్ తన లవ్ బ్రేకప్ అయ్యింది అని పోస్ట్ పెట్టడంతో అందరు మోనాల్ తోనా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇంస్టాగ్రామ్ లో ఒక ఫ్యాన్ అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చాడు.

Telugu Akhil Sarthak, Bigg Boss, Breakup Stroy, Monal-Movie

ఈ క్రమంలోనే రిలేషన్ షిప్ మీద మీ అభిప్రాయం ఏంటి అన్న ఒక నెటిజన్ ప్రశ్నించగా.బ్రేకప్ అయ్యింది అంటూ లవ్ బ్రేకప్ ఎమోజీలను షేర్ చేశాడు అఖిల్.ఆ ఎమోజీలలో కూడా చాలా అర్థం ఉంది తాను ప్రేమించిన వేరే అబ్బాయితో ఉన్నట్టుగా ఎమోజి పెట్టడం, తాను ఒంటరిగా నడుచుకుంటూ ఉండే ఎమోజీలను పెట్టడంతో రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మరి అఖిల్ ఎవరికి బ్రేకప్ చెప్పాడు అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.కానీ అందరికీ మోనాల్ వైపు దృష్టి మళ్ళింది.ఈ క్రమంలోనే ట్రోలర్స్ అఖిల్ పై సెటైర్లు వేస్తున్నారు.ఎవరా లక్కీ గర్ల్ నీలాంటి యాటిట్యూడ్ ఉన్న వాడిని తట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు అంటూ సెటైర్స్ వేస్తున్నారు.

కాగా ఇప్పటికే రెండుసార్లు తన లవ్ ఫెయిల్యూర్ అయింది అన్న విషయం చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.మొదటి ఆమె కుక్కల వెంట పడుతున్నావు అంటూ అవమానించిందని, రెండవ ఆమె కులం పేరు చెప్పి దూరం పెట్టేసింది అని తెలిపాడు అఖిల్.

తాజాగా లవ్ బ్రేకప్ అని చెప్పడంతో ముచ్చటగా మూడోసారి కూడా అఖిల్ బ్రేకప్ అయ్యింది అని వార్తలు వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube