తమిళ స్టార్ నటుడు ధనుష్ హీరోగా తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం లో ఏషియన్స్ బ్యానర్ లో ఒక సినిమా ను అనుకున్నారు.ఆ సినిమా అనుకుని చాలా రోజులు అయినా కూడా ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు.
ఆ సినిమా తర్వాత వార్తల్లో నిలిచిన వెంకీ అట్లూరి మరియు ధనుష్ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది.ఆ మద్య ధనుష్ మరియు వెంకీ ల సినిమా సార్ షూటింగ్ కు సంబంధించిన హడావుడి హైదరాబాద్ లో జరిగింది.
షూటింగ్ రెండు షెడ్యూల్ లు పూర్తి అయ్యాయి.సినిమా సగం షూటింగ్ పూర్తి అయ్యింది.
త్వరలోనే తుది షెడ్యూల్ ను మొదలు పెట్టి నెల రోజుల్లో పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ ఆ మద్య వార్తలు వచ్చాయి.కాని అనూహ్యంగా సినిమా షూటింగ్ ఇప్పటి వరకు మళ్లీ ప్రారంభం కాకపోవడంతో ఏం జరుగుతోంది అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ధనుష్ ఈ సినిమా తో తెలుగు లో ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకోవాలనుకున్నాడు.
సినిమా రెండు భాష ల్లో విడుదల కాబోతున్న నేపథ్యం లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని అంతా భావించారు.కాని ఇప్పుడు సినిమా నే ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.సార్ సినిమా గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ ఇవ్వక పోవడంతో సార్ ఎక్కడ అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.ధనుష్ తెలుగు సినిమా ఎంట్రీ ఉందా లేదా అంటూ కొందరు చర్చించుకుంటున్నారు.
ధనుష్ మరో వైపు తమిళంలో బ్యాక్ టు బ్యాక్ సినిమా ల్లో నటిస్తున్నాడు.ఏమాత్రం గ్యాప్ లేకుండా నటిస్తున్న ధనుష్ ఎందుకు సార్ కు డేట్లు ఇవ్వడం లేదు అనేది కూడా ప్రశ్న.
సార్ సినిమా షూటింగ్ ను మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారా అంటూ ధనుష్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.







