బాలయ్యతో సినిమానే.. ఈ హీరోయిన్లను స్టార్ హీరోయిన్లుగా మార్చింది తెలుసా?

నందమూరి నట సింహం బాలకృష్ణ పవర్ఫుల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్.ఈ హీరో సినిమా ఏదైనా థియేటర్లో విడుదలైంది అంటే చాలు మాస్ ప్రేక్షకులకు పూనకాలు వచ్చేస్తూ ఉంటాయి.

 Heroines Career Changed After Balayya Movie Vijayashanthi Simran Nayanthara Deta-TeluguStop.com

అంతే కాదు సినిమా ఇండస్ట్రీ రికార్డులను కూడా తిరగరాస్తూ ఉంటుంది అని చెప్పాలి.అయితే ఇప్పటి వరకు నందమూరి బాలకృష్ణ ఎంతో మంది హీరోయిన్లతో తన కెరీర్లో నటించారు.

కానీ కొంతమంది హీరోయిన్లకు మాత్రం బాలయ్య సినిమాలతోనే కెరియర్ ఫేమ్ వచ్చి స్టార్ హీరోయిన్లుగా మారినవాళ్లు ఉన్నారు.ఇక ఇలా బాలయ్య వల్లే ఊహించని పాపులారిటీ సాధించిన హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం.

విజయశాంతి :

అప్పట్లో బాలయ్యకు పర్ఫెక్ట్ జోడిగా విజయశాంతి పేరు సంపాదించుకుంది.ఇద్దరూ కలిసి దాదాపు 17 సినిమాల్లో నటించారు.

వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఎక్కువగా సూపర్ డూపర్ హిట్ అయినవి ఉన్నాయి అని చెప్పాలి.కథానాయకుడు, పట్టాభిషేకం,ముద్దుల కృష్ణయ్య, లారీ డ్రైవర్ రౌడీ ఇన్స్పెక్టర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు అటు బాలయ్య కెరీర్లో మైలురాయిగా నిలిచాయ్.

ఇక వీరి కాంబినేషన్లో ఇప్పుడు వచ్చిన సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది చేయడంలోనూ అతిశయోక్తి లేదు.ఇక బాలయ్య నటించిన సినిమాలు హిట్ అవడంతో విజయశాంతికి తిరుగులేని క్రేజ్ వచ్చింది.

Telugu Balakrishna, Legend, Nayanthara, Ramya Krishna, Simha, Simran, Sonal Chau

సిమ్రాన్ :

బాలయ్య తో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ లలో సిమ్రాన్ కూడా ఒకరు అని చెప్పాలి.సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి ఇండస్ట్రీ హిట్ లు వీరిద్దరి కాంబినేషన్ లో ఉన్నాయి.వీరి కాంబినేషన్కి అప్పట్లో ఊహించని రేంజ్ లో క్రేజ్ వచ్చేసింది.అయితే బాలయ్యతో సినిమాల కారణంగానే సిమ్రాన్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

Telugu Balakrishna, Legend, Nayanthara, Ramya Krishna, Simha, Simran, Sonal Chau

నయనతార :

ఇండస్ట్రీలో ఒక సాదా సీదా హీరోయిన్గా కొనసాగుతున్న నయనతార బాలయ్య సరసన శ్రీరామరాజ్యం, సింహ, జై సింహా లాంటి హిట్ సినిమాల్లో నటించింది.దీంతో ఒక్కసారిగా నయన్ కెరియర్ గా మారిపోయింది లేడీ సూపర్ స్టార్ అయిపోయింది.దీంతో వైవిధ్యమైన పాత్రలు ఆమె తలుపు తట్టడం మొదలయ్యాయి.

Telugu Balakrishna, Legend, Nayanthara, Ramya Krishna, Simha, Simran, Sonal Chau

సోనాల్ చౌహాన్ :

ఒక సాదాసీదా హీరోయిన్ గా ఉన్న సోనాల్ చౌహాన్ కెరియర్ బాలయ్యతో సినిమా తర్వాత ఒక్కసారిగా టర్న్ అయ్యింది.బాలయ్య సరసన లెజెండ్, రూలర్, డిటెక్టర్ సినిమాలు చేసిన తర్వాత మరికొంతమంది స్టార్ హీరోల సినిమాలో అవకాశం దక్కించుకుంది.

Telugu Balakrishna, Legend, Nayanthara, Ramya Krishna, Simha, Simran, Sonal Chau

రమ్యకృష్ణ :

అప్పట్లో బాలయ్యకు పర్ఫెక్ట్ జోడిగా పేరు సంపాదించుకున్న రమ్యకృష్ణ.బాలయ్యతో నాలుగు సినిమాలు చేసింది.బాలయ్య తో చేసిన సినిమాలు మంచి విజయం సాధించడంతో అప్పట్లో రమ్యకృష్ణ పై ఐరన్ లెగ్ అని ఉన్న ముద్ర కాస్త మాసి పోయింది అని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube