సోషల్ మీడియాలో అనేక వీడియోలు హల్‌చల్ చేస్తూనే ఉంటాయి.వాటిలో కొన్ని చూడటానికి ఆహ్లాదకరంగా ఉంటాయి.
వాటిని ఎన్నిసార్లు అయినా చూడాలనిపిస్తూ ఉంటుంది.వాటికి మిలియన్ల సంఖ్యలో లైక్స్, కామెంట్స్ వస్తూ ఉంటాయి.
ఆహ్లాదకరమైన వీడియోలను చూసేందుకు జనాలు ఆసక్తి చూపుతూ ఉంటారు.తాజాగా ఓ బాతుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ఓ బాతు పూలతో నిండిన చెరువులో ఈత కొడుతూ ఎంత ప్రశాంతంగా గడుపుతుందో ఈ వీడియోలో చూడవచ్చు.బాతు ఈత కొడుతుండగా.కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.దీంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
యోద ఫర్ ఎవర్ అనే యూజర్ ఈ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు.దీంతో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బాతు స్విమ్మింగ్ చేస్తూ ఉన్న ఈ వీడియో చక్కర్లు కొడుతూ లక్షలకొద్ది లైక్స్ ను సొంతం చేసుకుంటోంది.
ఈ వీడియోలో ఓ బాతు జపనీస్ చెర్రీ లేదా సాకురా అని పిలిచే చెర్రీ ప్లాసమ్ పువ్వుల అందమైన రేకులతో కప్పబడిన చెరువులో ప్రశాంతంగా ఈత కొడుతున్నది.
ఓ మార్గంలో పువ్వులను తొలగించుకుంటూ అతి దాడుతున్న దృశ్యం ఆసక్తిని కలిగిస్తుంది.ఇప్పటివరకు ఈ వీడియోను 48 వేల మంది లైక్ చేశారు.
ఇక నెటిజన్లు చాలారకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.బాతులాగా వీకెండ్ లో స్విమ్మింగ్ చేయాలని ఉందని కొంతమంది కామెంట్స్ పెడుతుండగా.
మరికొంతమంది బాతు ఉత్సహంగా బలే ఎంజాయ్ చేస్తుందని మరికొంతమంది కామెంట్స్ పెడుతున్నారు.బాతు లైఫ్ వేరేగా ఉందని, దాని పని బాగుందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
బాతు పచ్చని వాతావరణంలో ప్రకృతి అందాల వద్ద సేదతీరుతూ ఎంజాయ్ చేస్తుందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.







