డిప్యూటీ సీఎం రాజన్న దొర కీలక వ్యాఖ్యలు చేసారు.డిప్యూటీ సీఎం రాజన్న దొర తనకు నాడు టీడీపీ నుంచి వచ్చిన ఆఫర్ గురించి వివరించారు.
నాడు టీడీపీలో చేరితో తనకు రూ 30 కోట్లు ఇస్తామంటూ ఆ పార్టీ నేతలు ఆఫర్ చేసారని చెప్పుకొచ్చారు.దీంతో పాటుగా పిల్లల చదువు.
మంత్రి పదవి.అమరావతిలో ఇల్లు ఇస్తామని చెప్పారంటూ వెల్లడించారు.
కానీ, తమ నాయకుడు జగన్ పైన ఉన్న అభిమానంతోనే తాను పార్టీ వీడలేదని గుర్తు చేసుకున్నారు.
టీడీపీలోకి వెళ్లకపోవటం వలనే తానను ఈ రోజు మంత్రి పదవిలో ఉన్నానని వివరించారు.
తనకు తొలి కేబినెట్ లో మంత్రి పదవి రానందుకు బాధ పడలేదని.పుష్పశ్రీ వాణీకి అవకాశం వచ్చినా ఏనాడు విమర్శ చేయాలేదని చెప్పుకొచ్చారు.
డ్వాక్రా రుణ మాఫీ పేరుతో టీడీపీ హయాంలో వేల కోట్లు దోచుకున్నారని చెబుతూ.వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రూ 27 వేల కోట్లు మాఫీ చేసిందని వివరించారు.