ఇస్మార్ట్ శంకర్ తో సక్సెస్ ను దక్కించుకున్న హీరో రామ్ ఆ వెంటనే రెడ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పర్చిన విషయం తెల్సిందే.ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడంతో రామ్ కాస్త గ్యాప్ తీసుకున్నాడు.
సినిమా ఈసారి చేస్తే కచ్చితంగా హిట్ అవ్వాల్సిందే అన్న పట్టుదలతో ది వారియర్ సినిమాను చేశాడు.ఎన్నో కథలు విన్న తర్వాత మాస్ దర్శకుడిగా పేరు దక్కించుకున్న తమిళ తంబీ లింగు స్వామి దర్శకత్వంలో సినిమా ను చేసేందుకు ముందుకు వచ్చాడు.
హీరోగా రామ్ కు ఈ సినిమా లైఫ్ అండ్ డెగ్.ఇదే సమయంలో లింగు స్వామికి కూడా ఈ సినిమా అత్యంత కీలకం.ఇద్దరు కూడా చాలా గడ్డు పరిస్థితిలో ఉన్నారు.అయినా కూడా ఈ సినిమా ను నిర్మాతలు ఏకంగా 60 నుండి 70 కోట్ల రూపాయలను ఖర్చు చేసి తెరకెక్కించారు అనే వార్తలు వస్తున్నాయి.
సినిమా లో కృతి శెట్టి ఉండటం వల్ల ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు చాలా క్రేజీ మూవీగా భావిస్తూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ ముద్దుగుమ్మ ఇప్పటి వరకు నటించిన ఉప్పెన.
శ్యామ్ సింగరాయ్.బంగార్రాజు సినిమా లు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి.
ఇప్పటి వరకు ప్లాప్ అంటూ లేని హీరోయిన్ గా ఈ అమ్మడు పేరు దక్కించుకుంది.అందుకే ఈమె సెంటిమెంట్ తనకు వర్కౌట్ అవుతుందనే నమ్మకంతో ది వారియర్ చాలా హైప్ పెంచుకుని ఉన్నాడు.
రామ్ ఈ సినిమా తో హిట్ కొడితే బోయపాటి సినిమా పై అంచనాలు మరింతగా ఉండే అవకాశం ఉంది.వచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ది వారియర్ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో యూనిట్ సభ్యులు ఉన్నారు.
వారి నమ్మకంత అంతా కూడా బేబమ్మ కృతి శెట్టి సెంటిమెంట్ చుట్టు తిరుగుతుంది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.







