బాలీవుడ్ స్టార్ కి హీరోయిన్ అలియా భట్ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు.ఇలా ఈమె పెద్ద ఎత్తున వార్తలలో ఉండడానికి గల కారణం ఆమె ప్రెగ్నెన్సీ.
రణబీర్ కపూర్ నుపెళ్లి చేసుకున్న అలియా భట్ పెళ్లయిన రెండున్నర నెలలకి తాను ప్రెగ్నెంట్ అనే విషయం తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు సినీ ప్రముఖులు తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఈ విధంగా ఈమె తల్లి కాబోతుందని వార్త తెలియగానే ఎంతోమంది ఇక సినిమాలకు అలియా భట్ దూరమవుతుంది అంటూ పెద్ద ఎత్తున పుకార్లను సృష్టించారు.
ఈ క్రమంలోనే అలియా భట్ ప్రస్తుతం ఫారెన్ లో ఉన్నారని త్వరలోనే రణబీర్ కపూర్ వెళ్లి ఆమెను జాగ్రత్తగా ఇండియా తిరిగి తీసుకురానున్నారు అంటూ వార్తలు వచ్చాయి.ఈ వార్తలపై అలియా భట్ స్పందిస్తూ నెట్టిజనులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలా మీ చానల్స్ రేటింగ్స్ కోసం ఏది పడితే అది రాయడం మంచిది కాదు.ఎవరు ఎవరిని పికప్ చేసుకోబోతున్నారు.నేను మనిషిని పార్సల్ కాదు నన్ను జాగ్రత్తగా తీసుకురావడానికి అంటూ ఈమె నెటిజన్లపై ఫైర్ అయ్యారు.

ఇకపోతే అలియా భట్ సినిమాలకు దూరమవుతుందనే వార్తలపై స్పందించారు.తనకు ఎలాంటి విశ్రాంతి అవసరం లేదని ఈ విషయంలో నాకు డాక్టర్ సర్టిఫికెట్ కూడా ఉంది.సినిమాలో షూటింగ్ పాల్గొనడం నాకు ఎలాంటి ఇబ్బంది లేదు.
ఇక్కడితో నా కెరియర్ అయిపోయిందని ఊహించుకోకండి.ప్రస్తుతం మనం 2022 లో ఉన్నాము.
ఇప్పటికైనా పాత ఆలోచనలను వదిలిపెట్టండి.తాను షూటింగ్లో పాల్గొనడానికి కూడా సిద్ధంగా ఉన్నానని తను ఎలాంటి విశ్రాంతి తీసుకోవడం లేదు అంటూ ఈ సందర్భంగా అలియా భట్ తన గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు.