ఇదేం, ఆన్సర్ భయ్యా.. ఈ ఆన్సర్ పేపర్ చూసి నెట్టింట నవ్వులే నవ్వులు..!

సాధారణంగా పరీక్షల్లో ఆన్సర్లను పుస్తకంలో ఉన్నది ఉన్నట్లుగా చాలామంది రాస్తుంటారు.మరికొందరు తమదైన శైలిలో సమాధానాలు రాస్తుంటారు.

 Student Funny Answer For Software And Hardware Viral On Social Media Details, An-TeluguStop.com

సమాధానాలు ఎలా రాసినా విషయం కరెక్ట్ గా రాస్తే మార్కులు మంచిగానే వస్తాయి.అయితే కొందరు చదువు మీద ఆసక్తి లేక ఎప్పుడూ కూడా పుస్తకపఠనం చేయరు.

కానీ మార్కులు రావాలని, పాస్ కావాలని సోది కొడుతుంటారు.ఇలాంటి వారు ఒక్కోసారి రాసే సోది చూస్తే టీచర్లే నవ్వుకుంటారు.

అయితే తాజాగా అంతకుమించిన ఒక ఆన్సర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.ఈ ఆన్సర్ చూసి సదరు టీచర్ షాకై విద్యార్థులు ఇలా కూడా రాస్తారా అని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

ఇది చూసిన నెటిజన్లు వామ్మో ఏందయ్యా ఈ ఆన్సరూ! దీని అసలు ఆన్సరే అంటారా అని తెగ నవ్వుకుంటున్నారు.

వైరల్ అవుతున్న ఫొటోలో మీరు హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ మధ్య తేడాలు అనే ప్రశ్నకు సమాధానం చూడవచ్చు.

అయితే సదరు స్టూడెంట్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ప్రత్యేకతల గురించి ఏమీ రాయకుండా సోది కొట్టాడు.హార్డ్‌వేర్ హార్డ్ గా ఉంటుందని.సాఫ్ట్‌వేర్ చాలా సాఫ్ట్ గా ఉంటుందని రాసుకొచ్చాడు.

Telugu Paper, Hardware, Software, Latest-Latest News - Telugu

హార్డ్ వేర్ అనేది ఒక వేరట.సాఫ్ట్‌వేర్ కూడా వేర్ యేనట.అందుకే ఈ రెండిటి మధ్య తేడా ఉండదట.

ఈ రెండు వేరు వేరు అట.వీటి మధ్య ఎలాంటి తేడాలు ఉండవట.ఇక చివరి పాయింట్‌లో “హార్డ్‌వేర్ యిస్ నాట్ సాఫ్ట్.సాఫ్ట్‌వేర్ యిస్ నాట్ హార్డ్” అని రాశాడు ఈ జాతిరత్నం.ఈ ఆన్సర్ చదివిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube