స్పెషల్ వీడియో షేర్ చేసి రచ్చ రచ్చ చేసిన లైగర్ టీమ్.. కారణమేంటంటే?

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మొదటి సినిమా ‘లైగర్’.ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.

 Team Liger Wishes Legendary Mike Tyson A Happy Birthday With A Special Video, Li-TeluguStop.com

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న లైగర్ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.

ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 25న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.

ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

అయితే ఈ సినిమా అప్డేట్ కోసం లైగర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.కానీ ఈ సినిమా అప్డేట్ మాత్రం పూరీ ఇవ్వక పోవడంతో ఫ్యాన్స్ అంతా గుర్రుగా ఉన్నారు.అయితే తాజాగా ఈ సినిమా నుండి ఒక అదిరిపోయే వీడియో రిలీజ్ చేసాడు పూరీ.

.ఈ వీడియోలో లైగర్ టీమ్ అంతా ఉన్నారు.ఇంతకీ ఆ వీడియో దేని గురించి అంటే.ఈ సినిమాలో దిగ్గజ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కూడా కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

ఈ రోజు ఈయన పుట్టిన రోజు జరుపు కుంటున్నారు.ఈ సందర్భంగా టీమ్ అందరితో విషెష్ చెప్పిస్తూ ఒక వీడియో చేసి వదిలాడు పూరీ.ఈ ఇంట్రెస్టింగ్ వీడియో అందరిని ఆకట్టు కుంటుంది.ఇందులో విజయ్, అనన్య, నిర్మాత కరణ్ జోహార్ తో పాటు ఛార్మి కూడా బర్త్ డే విషెష్ తెలిపారు.

ఇంకా ఈ వీడియోలో లొకేషన్స్ లోని కొన్ని షాట్స్ కూడా వదిలారు.ఇవన్నీ లైగర్ ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube