విటమిస్ సి.ఆరోగ్యానికే కాదు చర్మానికి ఎంతో అవసరమైన పోషకం.విటమిన్ సి చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.ముడతలు, మొటిమలు, మచ్చలు వంటివి ఏర్పడకుండా అడ్డుకట్ట వేస్తుంది.స్కిన్ టోన్ ను పెంచుతుంది.ఎండల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.
అందుకే చాలా మంది ఆరోగ్యమైన, అందమైన చర్మం కోసం విటమిన్ సి సీరమ్‌ను కొనుగోలు చేసి వాడుతుంటారు.అయితే ఇంట్లోనే న్యాచురల్ గా కూడా విటమిన్ సి సీరమ్‌ను తయారు చేసుకోవచ్చు.
అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా రెండు నుంచి మూడు నిమ్మ పండ్లను తీసుకుని వాటర్ లో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో కట్ చేసి పెట్టుకున్న నిమ్మ పండు ముక్కలను వేసుకుని.
నీరు సగం అయ్యే వరకు ఉడికించాలి.ఇలా ఉడికించుకున్న నిమ్మ పండు ముక్కలను చల్లారబెట్టుకోవాలి.
పూర్తిగా కూల్ అయ్యాక అప్పుడు వాటర్‌తో సహా నిమ్మపండు ముక్కలను మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.ఈ పేస్ట్ నుండి స్ట్రైనర్ సాయంతో లూస్ స్ట్రక్చర్‌లో ఉన్న క్రీమ్‌ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ క్రీమ్‌లో వన్ టేబుల్ స్పూన్ అలోవెర జెల్, చిటికెడు పసుపు, వన్ టేబుల్ స్మూన్ ఆల్మండ్ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకుంటే విటమిన్ సి సీరమ్ సిద్దమైనట్లే.
దీనిని ఒక బాటిల్లో నింపుకుని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే పది రోజుల పాటు వాడుకోవచ్చు.నైట్ నిద్రించే ముందు వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకుని.ఆపై తయారు చేసుకున్న విటమిన్ సి సీరమ్‌ను అప్లై చేసుకోవాలి.
ఇలా ప్రతి రోజు గనుక చేస్తే ముఖ చర్మం ప్రకాశవంతంగా, యవ్వనంగా మెరుస్తుంది.మరియు ముఖంపై మచ్చలు, మొటిమలు, ముడతలు ఉంటే.
వాటి నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది.