F3 సక్సెస్ తర్వాత అనీల్ రావిపుడి క్రేజ్ మరింత పెరిగిందని చెప్పొచ్చు.పటాస్ టు ఎఫ్3 వరుస సూపర్ హిట్లతో డైరక్టర్ గా తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న అనీల్ రావిపుడి తన నెక్స్ట్ సినిమా నందమూరి నట సింహం బాలకృష్ణతో చేస్తున్నాడని తెలిసిందే.
బాలయ్య బాబుతో అనీల్ రావిపుడి ఖచ్చితంగా ఈ కాంబో డిఫరెంట్ గా ఉండబోతుందని చెప్పొచ్చు.అసలైతే బాలయ్య 100వ సినిమానే అనీల్ రావిపుడి డైరెక్ట్ చేయాలని అనుకున్నారు కానీ ఆ టైం లో క్రిష్ చెప్పిన శాతకర్ణి కథకే బాలకృష్ణ ఓటేయడంతో ఈ కాంబో మూవీ వాయిదా పడ్డది.
ఈ గ్యాప్ లో వెంకటేష్, వరుణ్ లతో రెండు సినిమాలు, మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమాలతో హిట్ మేనియా కొనసాగించాడు అనీల్ రావిపుడి.ఫైనల్ గా బాలయ్య 108వ సినిమా డైరక్షన్ ఛాన్స్ అందుకున్నాడు.
ఈమధ్యనే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాగా ఈ సినిమా స్టోరీ సిట్టింగ్స్ కోసం అనీల్ రావిపుడి తన టీం తో వైజాగ్ వెళ్లారని తెలుస్తుంది.అక్కడే తన టీం తో సినిమా కథని సిద్ధం చేస్తారట.
బాలయ్యకి జస్ట్ లైన్ చెప్పి ఒప్పించిన అనీల్ రావిపుడి ఈ సినిమాని కూడా తన మార్క్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు.







