చావు గురించి షాకింగ్ కామెంట్లు చేసిన జూనియర్ ఎన్టీఆర్.. ఏమన్నారంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఏ విషయం గురించి మాట్లాడినా పూర్తిస్థాయి అవగాహనతో మాట్లాడతారనే సంగతి తెలిసిందే.2009 ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున ప్రచారం చేయగా ఆ సమయంలో యాక్సిడెంట్ కు గురయ్యారు.ఆ యాక్సిడెంట్ గురించి ఒక సందర్భంలో స్పందించిన తారక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మనకేం జరుగుతుందో ఎవరికీ గ్యారంటీ లేదని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు.

 Young Tiger Junior Ntr Shocking Comments About Death Goes Viral , Young Tiger J-TeluguStop.com

ఎప్పుడు ఎవరికి చావు వస్తుందో ఎప్పుడు ఎవరికి ఏమొస్తుందో మనకు తెలియదని ఎన్టీఆర్ కామెంట్లు చేశారు.మనం ఎప్పుడు పుట్టామో మనకు తెలియదని మనం ఎప్పుడు చనిపోతామో కూడా మనకు తెలియదని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

బ్రతికినంత కాలం వీడిని తిట్టుకుని వాడిని తిట్టుకుని ఉండటం ట్రాష్ అని నువ్వు ఆనందంగా ఉన్నావా లేదా అనేది మాత్రమే ముఖ్యమని యంగ్ టైగర్ ఎన్టీఆర్ కామెంట్లు చేశారు.

చచ్చిపోయే మరుక్షణం వరకు నువ్వు ఆనందంగా ఉండాలని చనిపోయే సమయంలో ఇంకా చాలా చూడాలిరా అనే భావన కలగకూడదని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు.

యాక్సిడెంట్ జరిగిన సమయంలో నేను డ్రింకింగ్ చేశానో లేదో డాక్టర్లకు తెలుసని ఫ్రీగా మాట్లాడే వాళ్లు చాలామంది ఉన్నారని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు.దొరికిందే అవకాశం కదా ఏదో ఒకటి మాట్లాడాలని చాలామంది మాట్లాడతారని ఎన్టీఆర్ తెలిపారు.

Telugu Jr Ntr-Movie

అలా కామెంట్లు చేసేవాళ్ల బ్రతుకులు ఎంత నీచంగా ఉంటాయో అందరికీ తెలుసని ఎన్టీఆర్ అన్నారు.నాకు మందు పడదని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు.కంత్రి మూవీలో మందు తాగకుండానే కిక్ లో ఉంటానని ఒక డైలాగ్ ఉందని నా రియల్ లైఫ్ కు సంబంధించి ఆ డైలాగ్ నిజమేనని జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చావు గురించి చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube