బుల్లితెర ప్రముఖ యాంకర్లలో ఒకరైన సుడిగాలి సుధీర్ ప్రస్తుతం ఈటీవీ ఛానల్ కు దూరంగా ఉంటూ ఇతర ఛానెళ్ల ప్రోగ్రామ్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.థాంక్యూ దిల్ సే ప్రోగ్రామ్ లో హీరోయిన్ రాశీఖన్నాతో సుధీర్ రొమాన్స్ చేయడం గమనార్హం.
ఆదివారం ప్రసారమైన ఎపిసోడ్ లో గోపీచంద్, శ్రీముఖి ఒకవైపు సుధీర్, రాశీఖన్నా మరోవైపు ఉన్నారు.శ్రీముఖి గోపీచంద్ తో కలిసి ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన పాటను పాడారు.
సుధీర్ నేను అడిగితే శ్రీముఖి ఒక్క లైన్ కూడా పాడలేదని చెప్పగా లేడీస్ అడిగిన సమయంలో పాడకపోతే ఫీల్ అవుతారంటూ గోపీచంద్ సుధీర్ పరువు తీసేశారు.ఆ తర్వాత సుధీర్ మా వైపు రాశీఖన్నా గారు ఉన్నారని చెబుతాడు.
ఆ తర్వాత రాశీఖన్నా నాకోసం ఒక పాట పాడతావా అని సుధీర్ ను అడిగారు.సుధీర్ వెంటనే సిగ్గు పడుతూ నేను అమ్మాయిలను ఎప్పుడూ టచ్ చేయను అంటూ కామెంట్ చేశారు.
మొదట ఏం సందేహం లేదు పాట పాడిన సుధీర్ ఆ తర్వాత అడిగా అడిగా పాటను పాడారు.ఆ తర్వాత గోపీచంద్ ఏమడిగావ్ అంటూ మళ్లీ సుధీర్ పరువు తీసేశారు.
ఆ తర్వాత రాశీఖన్నా ఏం సందేహం లేదు పాటను అద్భుతంగా పాడి మెప్పించారు.సుధీర్ రాశీఖన్నాతో నాకు అమ్మాయిలను ముట్టుకోవడం అంటే కొంచెం ప్రాబ్లం అని చెప్పగా నాకు ఏ ప్రాబ్లం లేదని రాశీఖన్నా చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత శ్రీముఖి సుధీర్, రాశీఖన్నా కలిసి డ్యాన్స్ వేయాలని కోరగా అమ్మాయిలతో డ్యాన్స్ వేయాలంటే నాకు సిగ్గు అని సుధీర్ కామెంట్ చేశారు.దర్శకుడు మారుతి అమ్మాయిలతో కాకుండా అబ్బాయిలతో డ్యాన్స్ వేస్తావా అంటూ సుధీర్ పరువు తీసేశారు.ఏ సందేహం లేదు పాటకు డ్యాన్స్ చేసి సుధీర్, రాశీఖన్నా తమ పర్ఫామెన్స్ తో మెప్పించారు.రష్మీని వదిలేసి సుధీర్ రాశీతో రొమాన్స్ చేస్తున్నాడంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.