మామూలుగా ఏదైనా వస్త్రాల పైన, వస్తువుల పైన బొమ్మలు ఉండటం సహజం.ముఖ్యంగా స్త్రీలు, అమ్మాయిలు ధరించే దుస్తులపై కూడా బొమ్మలు లాంటి డిజైన్ లు ఉంటాయి.
అందులో అంతగా విచిత్ర పడాల్సిన అవసరమే లేదు.ఇక ఈ మధ్య మాత్రం చీరలపై ఏకంగా ఫోటోలతో డిజైన్ చేయించుకుంటున్నారు.
ఎందుకంటే అది ట్రెండీలో ఒక భాగమని అర్థమవుతుంది.కేవలం ఆడవాళ్ళ వస్త్రాల పైనే కాకుండా మగవారి వస్త్రాలపై కూడా కొన్ని కొన్ని బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి.నిజానికి అబ్బాయిలు ధరించే టీ షర్ట్స్ పైన కూడా క్రికెటర్స్ ఫోటోలు, హీరోల ఫోటోలు ఉండటం సహజం.కానీ హీరోయిన్ల ఫోటో ఉంటే మాత్రం అది చాలా విచిత్రంగా అనిపిస్తుంది.
అంతే కాకుండా చూడటానికి కూడా బాగా కామెడీగా ఉంటుంది.కొందరు వస్త్రాలను బాగా అమ్ముడు పోవడానికి వాటిపై ఒకప్పుడు పక్షుల, పువ్వుల వాటితో డిజైన్ చేయించేవాళ్లు.కానీ ఇప్పుడు హీరోల, హీరోయిన్ల ఫోటోలతో కూడా సేలింగ్ చేస్తున్నారు.ఒకప్పుడు ఓ సినిమాలో లుంగీ లపై ఐటమ్ డాన్సర్ ల బొమ్మలు కూడా వేసి వాటిని బాగా అమ్ముడు పోయే లా చేశాడు ఓ బట్టల వ్యాపారి.
అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి డబ్బులు సంపాదించడానికి ఒక బట్టల వ్యాపారికి లుంగీలపైన, రగ్గుల పైన ఇలా కొన్ని వస్త్రాల పైన ఐటమ్ డాన్సర్ల బొమ్మలు వేయించమని చెప్పటంతో ఆ బట్టల వ్యాపారి అలాగే చేసి బాగా డబ్బులు సంపాదించాడు.అలా ఇప్పుడు ఓ బట్టల వ్యాపారి సినిమా స్టైల్ ను ఫాలో అవుతూ తను చేసే బట్టల వ్యాపారం పై హీరోయిన్ ల బొమ్మలు పెట్టిస్తున్నాడు.
అలా తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ గా మారింది.అందులో ఒక వ్యక్తి తన షర్టుపై రష్మిక మందన ఫోటో పెట్టుకోవటం తో వెంటనే కెమెరాలో ఆ వ్యక్తి షర్ట్ ఫోటోను క్లిక్ మనిపించారు నెటిజన్లు.దీంతో ఆ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారటం తో పాటు బాగా ట్రోలింగ్స్ కూడా ఎదుర్కొంటుంది.ఒకప్పుడు హీరోయిన్ల పై అభిమానం చూపించాలి అంటే అలా హీరోయిన్లు ఉన్న బొమ్మ దుస్తువులను ధరించేవారు.
కానీ ఇప్పుడు అలా కాదు.ఎంత హీరోయిన్లపై అభిమానం ఉన్న కూడా అలా తమ షర్ట్ లపై అలా బొమ్మలు ఉండటానికి ఇష్టపడటం లేదు.దీంతో ఇప్పుడు రష్మిక మందన ఫోటో ఉన్న షర్ట్ ను చూసి అందరూ తెగ నవ్వుకుంటున్నారు.అంతే కాకుండా ఇదెక్కడి క్రేజీ రా మామ అంటూ రష్మిక ఫోటోతో ట్రోల్ చేస్తున్నారు.
ఇక ఆ ఫోటోకు తమకు నచ్చినట్లుగా కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.ఏదేమైనా ఇప్పుడు రష్మిక క్రేజ్ బట్టలపై కూడా ఇలా కనిపిస్తుంది అని అర్థమవుతుంది.
ఇక ఇటువంటి దుస్తులు మరిన్ని వస్తాయో చూడాలి.