ప్రభాస్‌తో మల్టీస్టారర్ చేయడానికి ఎప్పుడైనా సిద్ధమే.. ‘పక్కా కమర్షియల్’ ఈవెంట్‌లో గోపీచంద్ కామెంట్స్..

వరస విజయాలతో జోరు మీదున్న విలక్షణ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న సినిమా పక్కా కమర్షియల్.మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లుగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకున్న జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 Pakka Commercial Movie Hero Gopichand Wishes To Do Multi Starer With Prabhas Det-TeluguStop.com

బ‌న్నీ వాస్ నిర్మాత‌గా మ్యాచో హీరో గోపీచంద్‌తో చేస్తున్న పక్కా కమర్షియల్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ కాన్ఫెరెన్స్ విజయవాడలోని రాజ్ యువారాజ్ థియేటర్స్‌లో జరిగింది.ఈ కార్యక్రమంలో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు చిత్రయూనిట్.

ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో హీరో గోపీచంద్ గారు మాట్లాడుతూ.‘పక్కా కమర్షియల్ సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని.కచ్చితంగా అందర్నీ అలరిస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు.అలాగే తనకు ప్రభాస్ అంటే చాలా యిష్టమని.

ఎప్పుడైనా తనతో నటించడానికి సిద్ధమే అని తెలిపారు.పైగా ఆయనతో మల్టీస్టారర్ చేయాలని ఉన్నట్లు చెప్పారు గోపీచంద్.

పక్కా కమర్షియల్ గురించి మాట్లాడుతూ.ఈ సినిమాను మారుతి చాలా తెరకెక్కించారని’ తెలిపారు.

అనంతరం చిత్రయూనిట్ కనకదుర్గమ్మ గుడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు.

పక్కా కమర్షియల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 26న జరగనుంది.

దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నారు.ఈ సినిమాలో గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా రాసారు.

అలాగే రాశీ ఖన్నా పాత్రను హిలేరియస్‌గా డిజైన్ చేసారు.దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన టైటిల్ సాంగ్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

జులై 1, 2022న పక్కా కమర్షియల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు.

Telugu Maruthi, Gopichand, Multistarer, Pakka, Rashi Khanna-Movie

భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే లాంటి విజయాలతో అపజయమే లేని జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ – బ‌న్నీవాసు – కాంబినేష‌న్ లో పక్కా కమర్షియల్ సినిమా వస్తుంది.గ‌తంలో ఈ బ్యాన‌ర్స్ నుంచే ద‌ర్శ‌కుడు మారుతి భ‌లేభ‌లే మ‌గాడివోయ్, ప్ర‌తిరోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించారు.ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు.SKN సహ నిర్మాత‌.మరిన్ని వివరాలు త్వరలోనే చిత్రయూనిట్ తెలియజేయనున్నారు.

నటీనటులు:

గోపీచంద్, రాశీఖ‌న్నా, స‌త్య‌రాజ్, రావు ర‌మేశ్, సప్తగిరి తదితరులు.

టెక్నికల్ టీం:

స‌మ‌ర్ప‌ణ – అల్లు అరవింద్, బ్యాన‌ర్ – జీఏ2పిక్చ‌ర్స్, యూవీక్రియేష‌న్స్, నిర్మాత‌ – బ‌న్నీ వాస్, ద‌ర్శ‌కుడు – మారుతి, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ – ర‌వీంద‌ర్, మ్యూజిక్ – జ‌కేస్ బీజాయ్, స‌హ నిర్మాత – ఎస్ కే ఎన్, లైన్ ప్రొడ్యూసర్ – బాబు, ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ – సత్య గమిడి, ఎడిటింగ్ – ఎన్ పి ఉద్భ‌వ్, సినిమాటోగ్ర‌ఫి – క‌ర‌మ్ చావ్ల‌, పీఆర్ఓ – ఏలూరు శ్రీను, మేఘ‌ శ్యామ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube