వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం: బోండా ఉమా

విజయవాడ , వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని టీడీపీ నేత బోండా ఉమా అన్నారు.శనివారం ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాలు, విద్యుత్ రాయతీలు ఇవ్వాలంటూ  టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో బోండా ఉమా పాల్గొన్నారు.

 Injustice To All Sections In Ycp Rule, Bonda Uma ,tdp Leader Bonda Uma , Ycp Rul-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎస్సీ, ఎస్టీలను వాడుకుని వదిలేసిన జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్కరికైన న్యాయం చేశారా అని ప్రశ్నించారు.ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైన స్వయం ఉపాధి రుణాలు ఇచ్చారా? అని నిలదీశారు.టీడీపీ హయాంలో అమలు చేసిన అన్ని పధకాలను నిలిపివేశారని మండిపడ్డారు. అంబేడ్కర్ భవన్‌లలో గబ్బిలాలు తిరిగే పరిస్థితి తెచ్చారన్నారు.జగజ్జీవన్ రామ్ 200 యూనిట్ల ఉద్యుత్ ఉచిత పంపిణీ పథకాన్ని రద్దు చేశారని ఆయన అన్నారు.

జీరో బిల్ వచ్చే ఎస్సీ కుటుంబాలకు నేడు బిల్లులతో బాదుడు మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో ఎప్పుడో మాల గూడెం వంటివి ఉండేవి నేడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాత రోజుల్లోకి నెడుతున్నారని తెలిపారు.ఇప్పుడు సమాజంలో వెనుకబడిన వర్గాలు అందరితో కలిసి ఉండడం జగన్‌కు ఇష్టం లేదని అన్నారు.

ఎవరైనా కోర్టుకు వెళ్తే నిస్సిగ్గుగా నిధులు లేక పధకాలు ఆపేశామని చెప్తున్నారని విమర్శించారు.దుల్హన్ పధకం ఆపేశారని, జగన్ దోచేసిన సొమ్ముతో లబ్దిదారులకు రూ.10 లక్షల వరకు ఇవ్వొచ్చన్నారు.పధకాలను పునరుద్ధరించే వరకు గడప గడపకు ఎస్సీ నాయకులతో కలిసి ఉద్యమిస్తామని బోండా ఉమా స్పష్టం చేశారు.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube