ఉద‌యం వ‌ర్క‌వుట్స్ త‌ర్వాత దీనిని తీసుకుంటే వేగంగా బ‌రువు త‌గ్గుతారు!

ప్ర‌స్తుత రోజుల్లో వెయిట్ లాస్ కోసం ప్ర‌య‌త్నిస్తున్న వారి సంఖ్య కోట్లలో ఉంది.అందులో ఎటువంటి సందేహం లేదు.

 Take This Smoothie After Morning Workouts To Lose Weight Fast Details! Smoothie,-TeluguStop.com

ఒక‌వేళ మీరూ బ‌రువు త‌గ్గ‌డం కోసం ట్రై చేస్తున్న వారే అయితే.ఉద‌యం వ‌ర్క‌వుట్స్ చేసిన త‌ర్వాత ఏది ప‌డితే అది కాకుండా ఇప్పుడు చెప్ప‌బోయే సూప‌ర్ టేస్టీ అంటే హెల్తీ స్మూతీని తీసుకుంటే వేగంగా బ‌రువు త‌గ్గుతారు.

మ‌రి ఇంకెందుకు లేటు ఆ స్మూతీ ఏంటో.ఎలా త‌యారు చేసుకోవాలో.

అస‌లు దాని వ‌ల్ల వ‌చ్చే ఆరోగ్య లాభాలు ఎలా ఉంటాయో.తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా ఒక క్యారెట్, ఒక బీట్ రూట్‌ల‌ను తీసుకుని పీల్ తొల‌గించి వాట‌ర్‌లో శుభ్రంగా క‌డిగి ముక్క‌లుగా క‌ట్ చేసుకువాలి.ఒక ఆరెంజ్‌ను తీసుకుని పైతొక్క‌, లోప‌ల ఉన్న గింజ‌ల‌ను తొల‌గించి ముక్క‌లు క‌ట్ చేసుకోవాలి.

మూడు స్ట్రాబెర్రీల‌ను కూడా తీసుకుని నీటిలో క‌డిగి చిన్న చిన్న‌ ముక్క‌లుగా క‌ట్ చేయాలి.

ఇప్పుడు బ్లెండ‌ర్ తీసుకుని అందులో క‌ట్ చేసి పెట్టుకున్న ఆరెంజ్‌, స్ట్రాబెర్రీ, బీట్ రూట్, క్యారెట్ ముక్క‌లు వేసుకోవాలి.అలాగే ఐదు వేయించుకున్న జీడి ప‌ప్పులు, నాలుగు పొట్టు తొల‌గించిన బాదం ప‌ప్పులు,

Telugu Fruitvegetable, Tips, Latest, Smoothie, Workouts-Telugu Health

ఒక‌టిన్న‌ర గ్లాస్ ఫ్యాట్ లెస్ మిల్క్‌, రెండు గింజ తొల‌గించిన డేట్స్‌, రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసుకుని మెత్త‌గా బ్లెండ్ చేసుకుంటే ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ మిక్స్డ్ స్మూతీ సిద్ధం అవుతుంది.

చ‌క్క‌టి రుచితో పాటు బోలెడ‌న్ని పోష‌కాలు నిండి ఉండే ఈ స్మూతీని ఉద‌యం వ‌ర్క‌వుట్స్ త‌ర్వాత తీసుకుంటే శ‌రీరం కోల్పోయిన శ‌క్తి మొత్తం ల‌భిస్తుంది.అతి ఆక‌లి దూరం అవుతుంది.చిరు తిండ్లపై మ‌న‌సు మ‌ల్ల‌కుండా ఉంటుంది.మెటబాలిజం రేటు పెరుగుతుంది.ఫ‌లితంగా శ‌రీరంలోని క్యాల‌రీలు త్వ‌ర‌గా కరిగి వేగంగా బ‌రువు త‌గ్గుతారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube