అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.తాజాగా చేసిన కోవిడ్ పరీక్షల్లో బాలకృష్ణకు పాజిటివ్ నిర్ధారణ కావటంతో హోం ఐసోలేషన్‌కు వెళ్లారు.”తనకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు.పూర్తిగా ఆరోగ్యంతో ఉన్నా.
గత రెండు రోజులుగా తనని కలిసిన వారు కూడా కోవిడ్ టెస్టు చేయించుకోవాలి.
అందరూ కోవిడ్ నియంత్రణ చర్యలు పాటించాలి” అని తెలియజేశారు బాలకృష్ణ.
ప్రస్తుతం బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఓ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతుంది.