పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన నరేష్.. వివాదం ముదురుతుందిగా..

మన భారతీయ సంస్కృతిలో పెళ్లి అంటే ఎనలేని గౌరవం ఉంటుంది.ఇక్కడా పెళ్లి అంటే పెద్ద పండగలా చేస్తూ ఉంటారు.

 Senior Actor Naresh Comments On Marriage Details, Naresh, Marriage, Viral Commen-TeluguStop.com

ఇలా మన సంస్కృతిని పక్క దేశాల వారు కూడా ఎంతో గౌరవంగా చూస్తారు.అయితే అలాంటి పెళ్లి వ్యవస్థపై సీనియర్ నటుడు నరేష్ షాకింగ్ కామెంట్స్ చేసాడు.

ఈ కామెంట్స్ పై ఇప్పుడు నెట్టింట వివాదం చెలరేగుతుంది.ఈయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.

సీనియర్ యాక్టర్ నరేష్ ఇప్పటికే మూడు సార్లు పెళ్లి చేసుకున్నారు.అయితే ఆ మూడు పెళ్ళిళ్ళు కూడా పెటాకులు అయ్యాయి.ఈ క్రమంలోనే తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూలో పెళ్లి వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.మ్యారేజ్ లు సక్సెస్ ఎందుకు కావడం లేదు అంటే అప్పట్లో ఇద్దరిలో ఒకరు అంటే భర్త మాత్రమే సంపాదించుకుని వచ్చేవాడు.

కానీ ఇప్పుడు ఇద్దరు సంపాదిస్తుండడంతో ఎకనామికల్ బ్యాలెన్స్ స్టార్ట్ అయ్యి ఎవరికీ వారు సొంతంగా బ్రతకడం అలవాటు చేసుకుంటున్నారు.పదిలో ఏడుగురు లేదా కనీసం నలుగురు అయినా పెళ్లి అయినా కొద్దీ రోజులకే డైవర్స్ తీసుకుంటున్నారు.

ఒకరిద్దరు మాత్రమే రాజీపడి కలిసి ఉంటున్నారు.

Telugu Naresh, System, Naresh Fourth, Pavitra Lokesh, Senior Naresh-Movie

అందుకే ముందు ముందు మ్యారేజ్ వ్యవస్థనే ఉండదు.పెళ్ళికి మీనింగ్ అనేది లేకుండా పోతుంది.పెళ్లిపై నా హాప్ వదులు కున్నాను.

కళాకారులది సున్నితమైన మనసు.అందుకే సాధారణ వ్యక్తి కంటే ఆర్టిస్టుల లైఫ్ భిన్నంగా ఉంటుంది.

సినిమానే నా లైఫ్.నా ఫ్యాషన్.

నేను సినిమా కోసం ఏదైనా వదులుకుంటాను.అంటూ ఈయన పెళ్లిపై చేసిన కామెంట్స్ నెట్టింట పెద్ద దుమారం రేపుతున్నాయి.

ఈయన నాలుగవ పెళ్లి చేసుకున్నారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube