మళ్లీ చిరు, పవన్‌ ల మూవీ గురించి చర్చ మొదలు

మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు ఇద్దరు ముగ్గురు కలిసి నటిస్తే చూడాలని మెగా ఫ్యాన్స్ ఎప్పుడు కూడా కోరుకుంటూనే ఉంటారు.ఇటీవల మెగా స్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్ లు కలిసి ఆచార్య లో నటించిన విషయం తెల్సిందే.

 Pawan Kalyan And Chiranjeevi Movie News Pawan Kalyan , Chiranjeevi , Tollywood,-TeluguStop.com

ఆ సినిమా ప్లాప్ అయినా కూడా జనాలు ఆ ఇద్దరి కోసం చూడటం జరిగింది.ఇద్దరి కాంబోలో వచ్చిన ఆచార్య సినిమా చరిత్ర లో నిలిచి పోవడం ఖాయం.

ఇప్పుడు మరో ఛారిత్రాత్మక మూవీ కోసం అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు.చాలా సంవత్సరాల క్రితం చిరంజీవి సినిమా లో పవన్ కళ్యాణ్ కనిపించిన విషయం తెల్సిందే.

మళ్లీ ఇప్పటి వరకు ఎవరి సినిమా లో ఎవరు కూడా నటించలేదు.అయితే మద్య మద్యలో చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ ల యొక్క మల్టీ స్టారర్ మూవీ గురించి లేదంటే వారిద్దరి కాంబోలో ఒక గెస్ట్‌ రోల్‌ మూవీ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి.

తాజాగా వారిద్దరి కాంబోలో సినిమా అంటూ మళ్లీ వార్తలు మొదలు అయ్యాయి.

ఒక ప్రముఖ దర్శకుడు చిరంజీవి కోసం ఒక స్క్రిప్ట్‌ ను రెడీ చేశాడట.

ఆ కథ ఇటీవల చిరంజీవికి వినిపించడం ఆయన ఓకే అనడం జరిగిందట.స్క్రీన్‌ ప్లే విషయం లో చిన్న చిన్న మార్పులు సూచించడం.

వాటిని త్వరలోనే ఆ దర్శకుడు చేయడం కూడా జరుగుతుందట.ఈ సమయంలోనే ఆ స్క్రిప్ట్‌ లో చిన్న పాత్రకు గాను పవన్‌ కళ్యాణ్ అయితే బాగుంటుందని ఆ దర్శకుడు భావిస్తున్నాడట.

ఆ విషయాన్ని చిరంజీవి వద్ద చెప్పడంతో ఓకే అన్నట్లుగా తెలుస్తోంది.పవన్ మరియు చిరంజీవి కాంబో సినిమా ను వచ్చే ఏడాది లో పట్టాలెక్కిస్తారనే వార్తలు వస్తున్నాయి.

పవన్‌ కేవలం వారం రోజులు డేట్లు ఇస్తే సరిపోతుందిని సమాచారం అందుతోంది.మొత్తానికి మెగా స్టార్‌ చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ ల కాంబోలో సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది పెద్ద గుడ్‌ న్యూగ్ చెప్పుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube