మహేష్ విషయంలో నేను అనుకున్నదే నిజమైంది.. నరేష్ కామెంట్స్ వైరల్!

ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన సీనియర్ నరేష్ త్వరలో మళ్లీ పెళ్లి చేసుకోనున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.అయితే వైరల్ అయిన వార్తల గురించి తాజాగా స్పందించిన నరేష్ స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు.

 Senior Naresh Comments About Hero Mahesh Babu Goes Viral Details, Senior Naresh,-TeluguStop.com

మహేష్ గురించి సీనియర్ నరేష్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.మహేష్ విషయంలో తాను అనుకున్నదే నిజమైందని ఆయన వెల్లడించారు.

అమ్మ సినీ రంగంలో ఉండటం వల్ల తనకు సినిమాలపై ఎక్కువగా ఆసక్తి ఉండేదని పదో తరగతిలో తనకు ఎక్కువ మార్కులు రాలేదని ఆయన కామెంట్లు చేశారు.అమ్మ తిట్టినా ప్రయోజనం లేకపోయిందని ఆయన అన్నారు.

బాల నటుడిగా సీనియర్ నటులతో నటించానని ఆయన చెప్పుకొచ్చారు.నాలుగు స్తంభాలాట నాకు మంచి పేరు తెచ్చిపెట్టిందని ఆయన కామెంట్లు చేశారు.

కృష్ణగారి సినిమాలను తాను ఎక్కువగా చూసేవాడినని ఆయన నాకు స్పూర్తి అని నరేష్ అన్నారు.

నేను, రమేష్ సరదాగా ఉండేవాళ్లమని మాతో పోల్చి చూస్తే మహేష్ బాబు చాలా చిన్నవాడని నరేష్ చెప్పుకొచ్చారు.

Telugu Ghattamaneni, Kodukudiddina, Mahesh Babu, Ramesh, Senior Naresh, Krishna-

మహేష్ బాబు ఎక్కువగా మాట్లాడేవాడు కాదని సిగ్గరి అని నరేష్ వెల్లడించారు.మహేష్ కొడుకు దిద్దిన కాపురం మూవీ టైమ్ కు డ్యాన్స్ లు, ఫైట్లు చేసేవాడని అప్పుడే మహేష్ గొప్ప హీరో అవుతాడని భావించగా ఊహించిన విధంగానే గొప్ప హీరో అయ్యాడని నరేష్ కామెంట్లు చేశారు.

Telugu Ghattamaneni, Kodukudiddina, Mahesh Babu, Ramesh, Senior Naresh, Krishna-

నేను సినిమాలలోకి రావాలని ఎవరూ ఫోర్స్ చేయలేదని నా ఇష్టంతోనే సినిమాల్లోకి వచ్చి నటుడిగా కెరీర్ ను కొనసాగిస్తున్నానని నరేష్ అన్నారు.సినిమా రంగంలో రాణించాలంటే ప్రతిభ ఉండటంతో పాటు కాలం కలిసిరావాలని నా కొడుకు తన ఇష్టంతోనే సినిమాల్లోకి వచ్చాడని తన ప్రయత్నాలను తాను చేస్తున్నాడని నరేష్ కామెంట్లు చేశారు.నరేష్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube