స్విమ్మింగ్ పూల్‌లో మూత్ర విసర్జన చేస్తూ అడ్డంగా దొరికిన మహిళ.. వీడియో వైరల్!

ఈత నేర్చుకోవాలనుకునే వారికి మొదటగా గుర్తొచ్చేది సిమ్మింగ్‌ పూల్ అని చెప్పవచ్చు.చక్కటి వ్యాయామానికి, మంచి వినోదానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి స్విమ్మింగ్ పూల్ ఉత్తమంగా నిలుస్తుంది.

 Woman Caught While Urinating In Swimming Pool Video Viral Details, Swimming Pool-TeluguStop.com

అయితే ఇతర నీళ్లతో పోల్చుకుంటే స్విమ్మింగ్ పూల్‌లోని నీళ్లు చాలా శుభ్రంగా ఉంటాయని చాలా మంది అనుకుంటారు.కానీ అది నిజం కాదు.

కొందరు ఈ నీటిలోనే మూత్రవిసర్జన చేస్తుంటారు.ఇలాంటి వారిని కనిపెట్టడం సిమ్మింగ్ పూల్ నిర్వాహకులకు కూడా కష్టమే.

అయితే ఒక స్విమ్మింగ్ పూల్ యాజమాన్యం మాత్రం మూత్రం పోసే వారిని కనిపెట్టేందుకు ఒక కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టింది.దీనివల్ల తాజాగా ఒక మహిళ అడ్డంగా దొరికిపోయింది.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.దీన్ని చూసి నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో గ్లాస్ స్విమ్మింగ్ పూల్‌లో ఉండటం చూడవచ్చు.అయితే ఈమె కాళ్ళ మధ్యన ఉన్న వాటర్ బ్లూ కలర్ రంగులోకి మారిపోయింది.దీనితో స్విమ్మింగ్ పూల్ నుంచి బయటికి రావాలంటూ ఆమెని ఒక నిర్వాహకుడు కోరాడు.అయితే తన కాళ్ళ మధ్యలో నీళ్లు బ్లూగా మారటంతో అసలు ఏమవుతోందని ఆమె కంగారుపడుతూ అడిగింది.ఈ ప్రశ్నకు బదులిస్తూ “సమాధానంగా నీకు తెలియదా, పూల్ లో నువ్వు ఎలా మూత్రం పోసినట్లు కూడా తెలియడం లేదా?” అని అతడు ఘాటుగా రిప్లై ఇచ్చాడు.“హేయ్, నేనేం చేయలేదు నువ్వు పిచ్చివాడివా?” అని ఆమె తిట్టడం మొదలెట్టింది.దీంతో అతడు కూడా ఆమెని బయటికి వచ్చేయాలి అంటూ బాగా తిట్టాడు.దీంతో వీడియో ముగిసింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.ఈ అనుభవం ఆమెకు చాలా చేదుగా అనిపించవచ్చు అని ఒక యూజర్ కామెంట్ పెట్టారు.ఈ టెక్నాలజీ అన్ని చోట్లా తీసుకొస్తే ఎంతమంది పట్టుబడతారో అని మరొక యూజర్ ఫన్నీగా కామెంట్ చేశారు.ఇంత వయసు వచ్చినా ఇలాంటి పాడు పని చేయడమేంటని మరికొందరు ఆమెనే తిడుతున్నారు.

ఈ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube