ఉద్యమ పొలికేక-రచ్చబండ రాక-నేటి నుంచే శ్రీకారం

ధన స్వామ్యాన్ని బద్దలు కొట్టండి! ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి!!ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం! ధనస్వామ్య నేరమయ రాజకీయాలను సమాధి చేద్దాం!!త్రిశంకు స్వర్గంలో అభినవ భారతం ప్రజాస్వామ్య హననం-సార్వత్రిక భ్రమణం.

ఠారెత్తిన రీతి-చేష్టలుడిగిన నీతి శేషన్ ప్రయాస నీటి మూట చందం.

ఉద్యమ పొలికేక-రచ్చబండ రాక.నేటి నుంచే శ్రీకారం.ప్రజాస్వామ్యానికి పట్టం కడదాం నేరమయ రాజకీయాలను సమాధి చేద్దాం.

ధనస్వామ్యం వద్దు-సక్రమ వ్యవస్థలే హద్దు.యువతరం భాగస్వామ్యంతో ప్రత్యేక సావనీర్.

దేశ ప్రజలకు,తెలుగు రాష్ట్రాల వారికి ప్రజా ఉద్యకారుడు బోర సుభాష్ చంద్రబోస్ పిలుపు.అసాంఘిక శక్తుల చేతుల్లో పనిముట్టు-టిఎన్ శేషన్.

Advertisement

ఎన్నికల నిధులతో పెచ్చరిల్లుతున్న అరాచకం-జై భారత్ టివి రమణ మూర్తి.నిజాయితీకి నిలువుటద్దంగా నిలవాలి-మందకృష్ణ మాదిగ.

"వర్రె"మాటకు,నడుస్తున్న చరిత్రకు పొంతన ఎక్కడ? నల్లగొండ జిల్లా:ఎన్నికల ప్రక్రియను ధనశక్తి పూర్తిగా బ్రష్టు పట్టించకముందే,అసాంఘిక శక్తుల చేతుల్లో అది పనిముట్టుగా మారి పోకముందే సరైన సంస్కరణలకు సమ కట్టాలని మూడు దశాబ్దాల క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధిపతి టి.ఎన్.శేషన్ చేసిన సూచనలు చెత్తబుట్టలో పడ్డాయని ప్రజా ఉద్యమ కారుడు,సిపిఐ (ఎం-ఎల్) తెలుగు రాష్ట్రాల కార్యదర్శి బోర సుభాష్ చంద్రబోస్ ఆవేదన వ్యక్తం చేశారు."ప్రజాస్వామ్య పరిరక్షణ-దేశభక్తుల కర్తవ్యం" అనే పేరిట పౌర సమాజానికి బోస్ నేడొక బహిరంగ లేఖ వ్రాస్తూ అమెరికా అధ్యక్ష ఎన్నికల వ్యయం కంటే 50 శాతం అధికంగా దాదాపుగా రెండు లక్షల కోట్ల ఖర్చుతో గత సార్వత్రిక ఎన్నికల్లో ధనశక్తి విశ్వరూపాన్ని కళ్ళకు కట్టాయని బోర ఆవేదన వ్యక్తం చేశారు.92 కోట్ల భారతీయ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ అవేర్నెస్ చైర్మన్ బి.వి.ఆర్ మహాత్మా గాంధీజీ అధ్యయన బృందం వెల్లడించిందని,దేశవ్యాప్తంగా 198 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులు 100 కోట్ల రూపాయలకు పైగా వెదజల్లారు అంటే ఏమనుకోవాలి? అని బోస్ ప్రశ్నించారు.ఎన్నికల్లో నల్లధన ప్రవాహాలకు,గెలుపు గుర్రాలుగా నేరగాళ్ళ ఉరవళ్లకు,అధికారం దక్కాక అవినీతి పరవళ్ళకు ఎంత దగ్గరి సంబంధం ఉందో బోరన్న వివరించారు.

ధన ప్రభావ పీడ వీరగడ కావాలన్న లక్ష్యంతో "సేవ్ డెమోక్రసీ-సేవ్ నేషన్" పేరుతో దేశవ్యాప్తంగా వివిధ ప్రజాసంఘాలతో కలిసి ఐక్యంగా ప్రచార కార్యక్రమాలు,జనచైతన్య సభలు, సదస్సులను చేపడతామని బోర పేర్కొన్నారు.ముందుగా నేరమయ రాజకీయ వ్యవస్థను నిర్మూలించకుండా,పార్టీల నిర్వహణలో పారదర్శకతను పెంచకుండా,నిధుల ప్రవాహాల సక్రమ తనిఖీకి తగు చట్టబద్ధ యంత్రాంగాన్ని నెలకొల్పకుండా ప్రభుత్వమే పార్టీలకు ఎన్నికల నిధులు అందిస్తే అరాచకం మరింతగా పెరుగుతుందని జై భారత్ విప్లవ నేత టీ.వీ.రమణ మూర్తి చెప్పిన నిష్టుర మాటలు వాస్తవాలని బోస్ పేర్కొన్నారు.ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళనే లక్ష్యంగా సర్వ సమగ్ర సంస్కరణలపై జాతీయస్థాయిలో చర్చావేదికలు నిర్వహిస్తామని బోర తెలిపారు.

ఏడున్నర దశాబ్దాలుగా భారత ప్రజాస్వామ్యానికి నల్లధనమే ఇంధనంగా మారిందని, ఆ దుర్వినీతిని అరికట్టడంలో ప్రజా ప్రతినిధులు ప్రభుత్వాలు,పార్టీలు,పార్లమెంటుతో పాటు ఎన్నికల సంఘం విఫలమయిందని నక్సలైట్ ఉద్యమ నాయకుడు కొలగాని పర్వతాలు యాదవ్ అక్షర సత్యం చెప్పాడని బోరన్నా తెలిపారు.నల్లధన ప్రభావాన్ని నులిమేసే సంస్కరణగా తెచ్చిన ఎలక్ట్రోరల్ బాండ్లు,పారదర్శకత జవాబుదారీతనాలకు చెల్లుకొట్టి వ్యవస్థకు మరింత చెరుపు చేస్తున్నాయని సుభాష్ పేర్కొన్నారు.90% ఆర్థిక వనరులు ఒక పార్టీ చెంతనే పోగుపడుతున్నాయని,ధన,భుజ అధికార బలం వంటి దశ మహా పాతకాల ముష్టి ఘాతలతో దశాబ్దాలుగా కృశించిన మన ప్రజాస్వామ్యంను మార్చుకొనుటకు యువతరం నడుం బిగించాలని బోర కోరారు.ఎక్కడికి దిగిన రాజకీయ అవినీతి మర్రి,దేశ ప్రజా ప్రయోజనాల్ని జుర్రేస్తున్నా ఆత్మహత్య సదృశ్యమైన ఉదాసీనతపై పిడికిలి బిగించాలని యువతరానికి బోర పిలుపునిచ్చారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
మండుతున్న ఎండలు..వందేళ్ల రికార్డు బ్రేక్...!

మనదేశంలో ఉన్నత సార్వత్రిక వయోజన ఓటింగ్ పద్ధతి అయినందువల్ల పంచాయితీ నుండి పార్లమెంటు వరకు ఎన్నికయ్యే ప్రతినిధులదే కాదు,ఓటర్ల నిజాయితీని పదిలంగా కాపాడుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ ఒక నాడు చేసిన సూచనలు,ఓటు వెయ్యి అని ఓటర్లను అభ్యర్థించాల్సిన పార్టీలు నేడు ఓటుకువెయ్యిఅని మొదలుపెట్టి ప్రత్యర్థులపై పై చేయి సాధించడమే లక్ష్యంగా పోలింగ్ కు ముందునాడు సాగిస్తున్న ప్రత్యక్ష నగదు బదిలీ లక్షల కోట్ల రూపాయలకు చేరిందని బోర ఆవేదన వ్యక్తం చేశారు.గత సార్వత్రికంలో పార్టీలు ప్రచారం కోసం వెచ్చించిన మొత్తమే దాదాపు 50 వేల కోట్లని,ఎన్నికలంటే వివిధ అంశాలపై ప్రజల అవగాహన స్థాయిని పెంచే వేదిక అన్న ఆర్ టి ఐ చైర్మన్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు మాటలకు నడుస్తున్న చరిత్రకు అసలు పొంతన,పోలిక ఉన్నాయా? అని సుభాష్ ప్రశ్నించారు.అయిదు వేలు ఇచ్చిన వ్యక్తికి ఓటేస్తే ఐదేళ్లు దోపిడీని మౌనంగా భరించాల్సి వస్తున్న దురవస్థపై జాగృత జనచేతన రాజ్యాంగ వ్యవస్థల బాధ్యత కాదా? అని బోర నిలదీశారు.కొత్త సహస్రాబ్దిలో డిజిటల్ సాంకేతిక ర్యాలీలు,రోడ్ షో లో,బహిరంగ సభల వంటి మోటు ప్రచారాలకు చెల్లు కొట్టేలా నయా వేదికల్ని సృష్టించిన సారా ప్యాకెట్ల అనాగరిక పోకడల్ని వీడకపోవడంతో సిగ్గుచేటని బోర విమర్శించారు.

Advertisement

రాజకీయ పార్టీలకు నిధులు ఎలా ఉన్నాయనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టులో వాధించిందని,ఈ తరహా పార్టీలు సడలించి ప్రజల వలన,ప్రజల చేత, ప్రజల కొరకుగా భారత ప్రజాస్వామ్యానికి తిరిగి ప్రాణప్రతిష్ఠ చేసేలా గల్లి నుండి ఢిల్లీ వరకు చర్చలు, సదస్సులు,సభలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.రాజకీయ పార్టీలకు బాధ్యత జవాబుదారీతనాల్ని మప్పి వాటిని ప్రజాస్వామ్యబద్ధంగా తీర్చిదిద్దుటకు ప్రజల ఒత్తిడిని పెంచేందుకు రాజకీయేతర, దేశభక్తియుత సంఘంగా "ప్రజాస్వామ్య హక్కుల వేదిక" అనే సంస్థను ప్రారంభించి ప్రజా చైతన్య కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

నోట్లకి మద్యానికి ఐదు సంవత్సరాల భవిష్యత్తును అమ్మిన మనిషి బ్రతికున్న శవంతో సమానమని పేర్కొన్నారు.భార్య బిడ్డల్ని అమ్ముకోట్లేదు, తల్లిదండ్రుల్ని అమ్ముకోట్లేదు మరి పార్టీలు,నాయకులు పడేస్తున్న మనీకి, మద్యానికి ఓటును ఎందుకు అమ్ముకుంటున్నావు ? అని పౌర సమాజాన్ని బోర ప్రశ్నించారు.సమాజ సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం, సామరస్యం, అభ్యుదయం,నీతి, నిబద్ధత అర్హతలను వివేచించి ఓటు వేసేందుకు ఈనెల 5 వ,తేదీ నుండి 15వ తేదీ వరకు గ్రామస్థాయిలో రచ్చబండలు చేపడతామని,20 నుండి 25 వరకు జిల్లాస్థాయి సదస్సులు,27,28 తేదీలలో 2 తెలుగు రాష్ట్రాలలో జన చైతన్య కార్యక్రమాలు, వచ్చేనెల 10,11 తేదీలలో ఢిల్లీలో సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.

ఓటర్ల చైతన్య పెంచేందుకు పాఠశాల,కళాశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామని, యువతరం భాగస్వామ్యంతో ప్రత్యేక సావనీర్ తెస్తామని బోర తెలిపారు.సావనీర్ లో ప్రచురించే రచనలకు మంచి బహుమతులు అందజేస్తామని,ఆసక్తి కలిగినవారు తమ రచనలను, కార్టూన్లను బిజెఆర్ సర్దార్ పటేల్, కన్వీనర్, ప్రజాస్వామ్య హక్కుల వేదిక 2 -2- 231, 232 బాగ్ అంబర్ పేట, హైదరాబాద్- 500013 అడ్రస్ కి రచనలు పంపాలని, 9848540078 అనే నెంబర్ కు కూడా వాట్సాప్ లో పంపవచ్చునని బోర సుభాష్ చంద్రబోస్ తెలిపారు.

Latest Nalgonda News