వావ్.. ఈ పిల్లి ఎత్తుకోమని ఓనర్‌ని ఎలా అడుగుతుందో చూడండి..

సాధారణంగా పెంపుడు జంతువులు తమ యజమానులతో కమ్యూనికేట్ అయ్యేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తుంటాయి.ఆకలి వేసినప్పుడు ఫుడ్ పెట్టమని అడగడం, ప్రకృతి పిలిస్తే బయటికి వదిలేయాలని కోరడం, ఆడుకోవడానికి పిలవడం ఇలా ఇవి తమ బాడీ తోనే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ చేయగలవు.

 Wow See How This Cat Asks The Owner To Pick It Up , Cat, Owner, Viral Latest,-TeluguStop.com

అయితే ఇలా కమ్యూనికేట్ అయ్యే పెంపుడు జంతువులలో కుక్కలు మొదటి స్థానంలో ఉంటే, పిల్లులు రెండో స్థానంలో ఉంటాయని చెప్పవచ్చు.కాగా ఇప్పుడు ఒక పిల్లి యజమానిని క్యూట్‌గా ఎత్తుకోమని అడుగుతూ అందర్నీ ఫిదా చేస్తోంది.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.@thedodo అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే లక్షకు పైగా లైకులు, మిలియన్లలో వ్యూస్ వచ్చాయి.

ఈ వీడియోలో ఒక క్యూట్ క్యాట్ తన ముందు కాళ్లను పైకెత్తి.“ఎత్తుకోండి, ప్లీజ్” అని తన ఓనర్ ని బతిమిలాడుతున్నట్లు మీరు గమనించవచ్చు.ఓనర్ చాలా సందర్భాల్లో ఈ పిల్లి తనని ఎత్తుకోమని అడిగినట్లు ఈ వీడియోలో చెప్పకనే చెప్పింది.అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.“తనకు కూడా ఒక పిల్లి ఉండేదని, అది కూడా ఇలానే అడిగేద”ని ఒక యూజర్ కామెంట్ పెట్టాడు.సో, క్యూట్.

లవ్లీ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.చిన్న పిల్లాడి లాగా ఇది చాలా ముద్దుగా హగ్ అడుగుతుండటం చూసి మరికొందరు వావ్ అని ఆశ్చర్యపోతున్నారు.“ఈ క్యాట్ ఓనర్ చాలా లక్కీ.మా క్యాట్ ఫుడ్ కోసం తప్ప మా దగ్గరికి అస్సలు రాదు” అని ఒక యూజర్ పేర్కొన్నారు.

ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube