దసరా పండుగే పవన్ కళ్యాణ్ టార్గెట్.. నిర్మాతలు పోటా పోటీ?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టి వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

 Pawan Kalyan Target Is Dussehra Festival Producers Are Competition For That , Pa-TeluguStop.com

అలాగే ఇటీవల భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.

ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా సూర్య మూవీస్ బ్యానర్ పై ఏ దయాకర్ రావు తో కలసి స్టార్ ప్రొడ్యూసర్ ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా ఇంకా చిత్రీకరణ దశలోనే ఉండగానే మరొక సినిమాను పట్టాలెక్కించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

తమిళంలో సముద్రకని నటించిన వినోదయ సితం సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే.ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటు యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా నటించబోతున్న ట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాతో పాటు హరీష్ శంకర్ తో భగవంతుడు భగత్ సింగ్ సినిమా కూడా చేయాల్సి ఉంది.ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన ప్రస్తుతం నిర్మాతలను పరుగులు పెట్టిస్తోంది.

Telugu Pawan Kalyan, Tollywood-Movie

వచ్చే ఎన్నికల లోపు సినిమాలు అన్నీ పూర్తి కావాలని ఈ దసరా తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ ఏపీలో ప్రత్యేక యాత్రను నిర్వహించబోతున్నట్లు తెలిసిందే.దీంతో పవన్ నిర్మాత గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.దసరా లోపు పవన్ తో సినిమాలు పూర్తి చేయాలని పవన్ డేట్స్ కోసం నిర్మాతలు పోటీ పడుతున్నారు.అందుకు గల కారణం దసరా తర్వాత పవన్ ని పట్టుకోవడం చాలా కష్టం.

ఏపీ వ్యాప్తంగా ప్రత్యేక టూర్ ను నిర్వహించి అనంతరం ఎన్నికల ప్రచారానికి వెళ్ళిపోతున్నారు.ఒకవేళ పవన్ కళ్యాణ్ ని కలవాలి అంటే ఎన్నికల తర్వాతే.కాబట్టి నిర్మాతలు ఏది ఉన్న ఎన్నికల ముందే పూర్తి చేసుకోవాలి దసరాలోపె కంప్లీట్ చేసుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube