వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం కొండా సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.తెలంగాణ కు చెందిన వరంగల్ జిల్లా లో రాజకీయ కుటుంబం గా మంచి గుర్తింపు దక్కించుకున్న కొండా మురళి మరియు సురేఖ ల యొక్క జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా ను రూపొందించడం జరిగింది.
భారీ అంచనాల నడుమ రూపొందిన కొండా సినిమా ను ఈనెల 23వ తారీకును దేశ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లుగా వర్మ ప్రకటించాడు.తెలుగు లో అయితే ఇప్పటికే హడావుడి ఉంది.
కాని ఇతర భాష ల్లో మాత్రం కొండా విడుదల అవుతుందా లేదా అనేది తెలియడం లేదు.వర్మ ఏం సినిమా చేసినా కూడా అది ఎలా ఉందో పక్కన పెడితే ఖచ్చితంగా ఓ రేంజ్ లో పబ్లిసిటీ ఉంటుంది.
ఆ పబ్లిసిటీకి తగ్గట్లుగా సినిమా హడావుడి ఉంటుంది.ముఖ్యంగా వివాదాస్పద సినిమా లు చేసే సమయంలో వర్మ మొత్తం కాంట్రవర్సీ తోనే సినిమా ను జనాల్లోకి తీసుకు వెళ్తాడు.
కాని కొండా సినిమా ను మాత్రం ఆ విధంగా ఏమీ లేకుండా వర్మ మార్క్ లేకుండానే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా ను కనీసం వరంగల్ జనాలు అయినా చూస్తారా అన్నట్లుగా ప్రమోషన్ ఉంది.
విడుదలకు ఇంకా రెండు మూడు రోజులు కూడా లేదు అయినా కూడా హడావుడి కనిపించడం లేదు.వర్మ నుండి ఇలాంటి మార్క్ తో పబ్లిసిటీ ని ఎక్స్ పెక్ట్ చేయలేదు అంటూ అభిమానులు సైతం ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగింది.కొండా సినిమా ను వేరే భాష ల్లో మరియు ఇక్కడ ఎందుకు వర్మ పబ్లిసిటీ చేయడం లేదు అనేది తెలియాలంటే ఆయన నోరు విప్పాల్సిందే.
వర్మ ఈ సినిమా ను కొండా మురళి ని హీరోగా చూపిస్తూ తెరకెక్కించాడు.కాని కొందరు మాత్రం కొండ మురళి గురించి తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
కనుక అసలు విషయాలు వర్మ తీస్తాడా.చేస్తున్నాడా అనేది చూడాలి.







