ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు మోడల్ కాజల్ అలియాస్ జుబేదా ఫాతిమా.మతిస్థిమితం లేని ఈ కాజల్ అనే మహిళ పేరు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తోంది.
తినడానికి తిండిలేక ఉండటానికి సరిగా ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న ఈ మహిళ దగ్గరికి యూట్యూబ్ ఛానల్ కి వెళ్లి వారికి చేతనైన సహాయం చేస్తారు.అయితే ఈ విషయం కాస్త యూట్యూబ్ స్టార్ హర్ష సాయికి తెలియడంతో హర్ష సాయి కూడా ప్రజలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు.
ప్రస్తుతం పాన్ ఇండియా యూట్యూబర్ గా దేశవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్న హర్ష సాయి కష్టాల్లో ఉన్న ఎంతో మంది పేదలకు సహాయం చేస్తూ వారి పాలిట దేవుడిగా నిలుస్తున్నాడు.హర్ష సాయి కి వీరాభిమాని ఫేస్ బుక్ స్టార్ ఆశ.
ఫేస్ బుక్ స్టార్ ఆశ హర్ష సాయి ని కలవగా అప్పుడు హర్ష సాయి నా నుంచి నీకు ఏమైనా కావాలి అని అడగగా కాజల్ పరిస్థితి వివరించి ఆమెకు సహాయం చేస్తే చూడాలని ఉంది అంటూ ఆమెకు సంబంధించిన వీడియోలు హర్ష సాయి కి చూపించడంతో వెంటనే హర్ష సాయి కాజల్ పరిస్థితి చూసి చలించిపోయాడు.వెంటనే తన టీంతో కలసి అక్కడికి చేరుకున్నాడు.

కాజల్ పరిస్థితిని తెలుసుకున్న హర్ష సాయి ఆమెకు ఏకంగా లక్ష రూపాయలు సహాయం చేసి తన మంచి మనసు చాటుకున్నారు.అంతే కాకుండా ఇకపై కాజల్ బాధ్యతను తన యూట్యూబ్ ఫ్యామిలీకి అప్పగిస్తున్నట్లు వీడియో విడుదల చేశారు.అంతే కాకుండా కాజల్ తన అభిమాన హీరోయిన్ కావడంతో కాజల్ మాదిరిగా మేకప్ అవ్వడం ఆమెకు ఇష్టం.అందుకు ఈమెను మోడల్ కాజల్ అనే బస్తి వాళ్ళు ఆటపట్టిస్తూ ఉంటారు.
అయితే మొదట్లో ప్రతిరోజు మేకప్ వేసుకుని పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ బాగానే ఉన్న ఆమె ఆమె రెండో భర్త కొట్టిన దెబ్బలు వల్ల ఆమె పరిస్థితి ఇలా అయ్యింది అని కాజల్ చెప్పుకొచ్చింది.







