దర్శకుడు జీవన్ రెడ్డి దర్శకత్వంలో ఆకాష్ పూరి, గెహనా సిప్పి జంటగా నటించిన తాజా చిత్రం చోర్ బజార్. యువి క్రియేషన్స్ సమర్పణలో వీఎస్ రాజు ఈ సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానున్న విషయం తెలిసిందే.ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీబిజీగా ఉన్నారు.
అయితే విడుదలకు కేవలం ఒక మూడు రోజులు సమయం ఉండటంతో ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేశారు.ఈ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా దర్శకుడు జీవన్ రెడ్డి మాట్లాడుతూ.
చోర్ బజార్ ప్రేమ కథ సినిమా అయినప్పటికీ కథనం మొత్తం ఒక విలువైన డైమండ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది.అలాగే ఈ సినిమాలో పాటలు అన్నీ కూడా సహజత్వానికి దగ్గరగా ఉంటూ కమర్షియల్ గా సాగుతాయి.
అదే విధంగా ఈ సినిమాలో నేను అనుకున్న బచ్చన్ సాబ్ పాత్రకు ఆకాష్ పూరి 100% న్యాయం చేశారు అని చెప్పుకొచ్చాడు జీవన్ రెడ్డి.ఈ కథను పూరి జగన్నాథ్ గారు వినలేదు మా పై అంత నమ్మకం ఆయనకు అని తెలిపారు జీవన్ రెడ్డి.

అదే విధంగా తనకు సక్సెస్ ను క్యాష్ చేసుకోవడం రాదని తెలిపారు.జార్జి రెడ్డి సినిమా తర్వాత ఆ క్రేజ్ ను ఉపయోగించుకో లేదని తన ఫ్రెండ్స్ అంటూ ఉంటారు అని చెప్పుకొచ్చారు.అలాగే తాను మనసుకు నచ్చిన కథలను మాత్రమే తెరకెక్కిస్తుంటానని లెక్కలు వేసుకోవడం రాదని, సినిమాలు లేకపోతే ఊరెళ్ళి వ్యవసాయం చేసుకుంటాను అని తెలిపారు డైరెక్టర్ జీవన్ రెడ్డి.అలాగే సినీ ఇండస్ట్రీలో తనకు గురువు రామ్ గోపాల్ వర్మ అని రాంగోపాల్ వర్మ కు ప్రతి దర్శకుడితో కూడా స్నేహం ఉంది అని తెలిపారు జీవన్ రెడ్డి.
ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని చిత్ర బృందంతో పాటు అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.







