కేజిఎఫ్ 3 లో నటించేందుకు పోటీ పడుతున్న బాలీవుడ్ హీరోయిన్స్!

కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ తో ఏ రేంజ్ హిట్ అందుకున్నాడో అందరికి తెలుసు.కెజిఎఫ్ చాప్టర్ 1 భారీ హిట్ అందుకోవడంతో చాప్టర్ 2 చేసాడు.

 Bollywood Heroines Intrest On Kgf Chapter 3, Yash, Kgf Chapter 2, Prashant Neil,-TeluguStop.com

రెండేళ్ల నుండి ఈ సినిమా కోసం సౌత్ ఇండియా మాత్రమే కాదు బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారు.దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా పెరిగాయి.

ఏప్రిల్ 14న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది.

రిలీజ్ అయినా అన్ని చోట్ల ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగి పోయింది.

దీంతో మొన్నటి వరకు కేజిఎఫ్ మ్యానియా దేశాన్ని ఊపేసింది అనే చెప్పాలి.పార్ట్ 1 ను మించి సాలిడ్ ఎలిమెంట్స్ తో ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించడంతో ఈ సినిమాపై హైప్ పెరిగింది.

దీంతో ఈ సినిమా కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వచ్చాయి.

ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఏకంగా 1100 కోట్లు వసూళ్ల ను అందు కున్నట్టు సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది.

ఇండియాస్ టాప్ 3 సినిమాగా నిలిచింది.ఇక ఈ సినిమా పార్ట్ 3 కూడా ఉందని చెప్పడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు.

పార్ట్ 3 పై అందరి ఫోకస్ పడడంతో ఈ సినిమాలో అవకాశం వస్తే నటించేందుకు బాలీవుడ్ అగ్ర నటీనటులు కూడా సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది.

Telugu Bollywood, Bollywoodtop, Indias Top, Kgf Chapter, Prashant Neil, Srinidhi

చాప్టర్ 2 లో హీరోయిన్ క్యారెక్టర్ ను చంపేయడంతో పార్ట్ 3 కోసం ప్రశాంత్ నీల్ మరో హీరోయిన్ ను వెతకాల్సి ఉంది.దీంతో ఎవరిని సెలెక్ట్ చేయాలి అనే ఆలోచనలో మేకర్స్ కూడా ఉన్నారట.ప్రశాంత్ నీల్ తర్వాత ప్రాజెక్టులతో బిజీగా ఉన్న కూడా కేజిఎఫ్ 3 విషయంలో కూడా చర్చలు జరుపుతున్నట్టు టాక్.

ఈ సినిమా బాలీవుడ్ లోనే 450 కోట్లు కలెక్ట్ చేసింది.అందుకే ఈ సినిమాపై అక్కడ భారీ అంచనాలు ఉన్నాయి.ఇలా భారీ అంచనాలు ఉండడంతో బాలీవుడ్ టాప్ హీరోయిన్ లు సైతం చాప్టర్ 3 లో నటించేందుకు పోటీ పడుతున్నారట.మరి నీల్ ఎవరిని సెలెక్ట్ చేస్తాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube