ప్రముఖ OTT దిగ్గజం నెట్ ఫిక్స్ ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా తన నియమ నిబంధనలు మార్చుకుంటూ పోతుంది.ఈ క్రమంలో వినియోగదారులు కొన్ని విషయాలలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని హెచ్చరికలు జరీ చేస్తోంది.
నెట్ ఫ్లిక్స్ అకౌంట్ ఉపయోగించే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి తప్పులు చేయరాదు.లేదంటే, మీ అకౌంట్ పూర్తిగా బ్యాన్ అయ్యే అవకాశం లేకపోలేదు.
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ యూజర్లు తమ అకౌంట్ పాస్ వర్డులను షేర్ చేయడాన్ని నిషేదించిన సంగతి తెలిసినదే.తాజాగా ఇంకొన్ని విషయాలలో ఒకింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తోంది.
ఇకనుండి యూజర్లు తమ నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఈ 3 పనుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.మీలో అనేకమంది ఆన్‌లైన్‌లో ప్రైవసీ కోసం ఎక్కువగా VPN వినియోగిస్తుంటారు.
ప్రధానంగా ఆన్‌లైన్ యాక్టివిటీని హైడ్ ఇది చేస్తుంది.మీ నెట్‌వర్క్‌ను సైబర్ నేరగాళ్ల నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది.
ఏదైనా Wi-Fi నెట్‌వర్క్‌లో మీ IP అడ్రస్, బ్రౌజింగ్ హిస్టరీ, వ్యక్తిగత డేటాను కూడా హైడ్ చేయగలదు.ప్రైవసీ ఆధారితమైనప్పటికీ, నెట్‌ఫ్లిక్స్ యూజర్లు VPN నెట్‌వర్క్‌లో యాప్‌ను బ్రౌజ్ చేయరాదు అనే నిబంధన వున్నది.

అలాగే మీరు వేరే దేశంలో ఉన్నారని నమ్మేలా VPNలతో గేమ్స్ వాడవద్దు.ఇలా చేస్తే Netflix ఎంతమాత్రం ఉపేక్షించదని గుర్తించుకోండి.సర్వీసును అందించే భౌగోళిక స్థానాల్లో మాత్రమే కంటెంట్‌కు లైసెన్స్ కలిగి ఉన్నామని Netflix నిబంధనల్లో పేర్కొంది.నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ దిగ్గజం అందించే కంటెంట్ డుప్లికేట్ చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది.
నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫారమ్‌లో ఏదైనా ఆర్కైవ్ చేయడం, రీపబ్లీష్ చేయడం, ఇతర సైట్లలో పోస్టు చేయడం, మార్చడం, లైసెన్స్ మార్చే యూజర్లపై Netflix నిఘా ఎల్లపుడూ ఉంటుంది.ఒకవేళ ఇక్కడ మెన్షన్ చేసిన నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం Netflix నెట్ ఫ్లిక్స్ సర్వీసును పూర్తిగా నిలిపివేస్తుంది అని గుర్తించండి.