టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రియ ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరి సరసన నటించి అగ్రతారగా గుర్తింపు పొందారు.ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఈమె ప్రస్తుతం ఇండస్ట్రీలో పలు కీలక పాత్రలో నటిస్తూ పెద్దఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తోంది.
ఇప్పటికీ శ్రియ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్నప్పటికీ ఈమెకు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పాలి.ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వ్యక్తిగత జీవితంలో కూడా శ్రియ ఎంతో సంతోషంగా ఉన్నారు.
ఈ క్రమంలోనే నిత్యం తన భర్త కూతురుతో కలిసి శ్రీయ చేసే హంగామా గురించి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.ఈ విధంగా సోషల్ మీడియాలో కూడా విపరీతమైన అభిమానులను సంపాదించుకున్న ఈమె తాజాగా తన సోషల్ మీడియా ద్వారా ఒక న్యూడ్ ఫోటో షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు.
తాజాగా శ్రియ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఒక న్యూడ్ ఫోటో షేర్ చేశారు.ఈ ఫోటో షేర్ చేసిన క్షణాల్లోనే వైరల్ గా మారింది.

తాజాగా నటి శ్రీయ ఓ ఆర్ట్ గ్యాలరీని సందర్శించారు అయితే అక్కడ వెనుతిరిగి ఉన్నటువంటి ఒక అమ్మాయి న్యూడ్ పెయింటింగ్ ఉంది.ఆ న్యూడ్ పెయింటింగ్ వద్ద శ్రియ ఫోటో దిగి ఆ ఫోటోను ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేశారు.ఆర్ట్ గ్యాలరీ లో ఎన్నో రకాల ఫోటోలు ఉండగా శ్రీయ ఈ విధంగా న్యూడ్ పెయింటింగ్ దగ్గర ఫోటో దిగుతూ దానిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఎంతో మంది ఈ ఫోటో పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.ఈ విధంగా ఈ ఫోటో ద్వారా శ్రీయ నెటిజన్ల నుంచి పలు విమర్శలు సైతం ఎదుర్కోవాల్సి వస్తోంది.
మొత్తానికి ఈ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.







