అందం, ఆరోగ్యం.రెండు మనకు ముఖ్యమే.
రెండిటిలో ఏది తగ్గినా.ప్రశాంతంగా ఉండలేము.
అందుకే ఆరోగ్య పరంగా, సౌందర్య పరంగా మేలు చేసే ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే జ్యూస్‌ను రోజూ మార్నింగ్ టైమ్ లో తీసుకుంటే అటు ఆరోగ్యం, ఇటు అందం రెండిటినీ సమర్థవంతంగా పెంచుకోవచ్చు.
మరి ఇంకెందుకు లేటు ఆ జ్యూస్ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.
తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక టమాటో, ఒక క్యారెట్ తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
అలాగే ఒక ఆరెంజ్‌ను తీసుకుని పైతొక్క, లోపల ఉన్న గింజలను తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఆరెంజ్ పండు ముక్కలు, చిన్న అల్లం ముక్క, రెండు పుదీనా ఆకులు, హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకుంటే క్యారెట్-టమాటో-ఆరెంజ్ జ్యూస్ సిద్ధం అవుతుంది.
చక్కటి రుచిని కలిగి ఉండే ఈ జ్యూస్‌ను బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకుంటే.గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గు ముఖం పడుతుంది.
మలినాలు తొలగిపోయి బాడీ డిటాక్స్ అవుతుంది.మెదడు పని తీరు చురుగ్గా మారి.
జ్ఞాపకశక్తి, ఆలోచన శక్తి రెట్టింపు అవుతాయి.అలాగే క్యారెట్-టమాటో-ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ మెండగా ఉంటాయి.
అందువల్ల ఈ జ్యూస్ తీసుకుంటే ఇమ్యూనిటీ సిస్టమ్ ఇంఫ్రూవ్ అవుతుంది.రక్తహీనత దరి దాపుల్లోకి రాకుండా ఉంటుంది.కంటి చూపు మెరుగుపడుతుంది.బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపు తప్పకుండా ఉంటాయి.చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా, ఫైనీగా మెరుస్తుంది.జుట్టు సంబంధిత సమస్యలు ఉన్నా.
వాటి నుంచి విముక్తి లభిస్తుంది.