జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులర్ అయిన సెలబ్రిటీలలో జబర్దస్త్ ఫైమా ఒకరు.ఫైమా కోసం ఈ షోను చూసే అభిమానుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉందనే సంగతి తెలిసిందే.
తనదైన శైలిలో డైలాగ్స్ చెప్పడం ద్వారా ఫైమా అంతకంతకూ ఫేమస్ అవుతున్నారు.ఫైమా పాత్రలో నటించకుండా జీవిస్తారని ఆమె వేసే పంచ్ లు కడుపుబ్బా నవ్విస్తాయని ఆమె ఫ్యాన్స్ చెబుతున్నారు.
తక్కువ సమయంలోనే ఫైమా ఊహించని స్థాయిలో పాపులర్ అయ్యారు.
అయితే జబర్దస్త్ ఫైమా బ్యాగ్రౌండ్ గురించి, ఆమెకు సంబంధించిన ఇతర విషయాల గురించి అభిమానులకు ఎక్కువగా తెలియదు.
ఒక ఇంటర్వ్యూలో ఫైమా మాట్లాడుతూ కామెడీ షోలలో తన ఎంట్రీ వెనుక జరిగిన ఆసక్తికర ఘటనల గురించి చెప్పుకొచ్చారు.టీవీ షోలలోకి వస్తానని తన కుటుంబ సభ్యులను ఒప్పించడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చిందని ఫైమా తన మాటల ద్వారా వెల్లడించారు.
తాను నిరుపేద కుటుంబం నుంచి వచ్చానని ఇంట్లో టీవీ కూడా లేని పేద కుటుంబం తనదని ఆమె చెప్పుకొచ్చారు.సార్ సహాయంతో తాను పటాస్ షోకు వచ్చానని ఆ షో డైరెక్టర్లు తన మాటతీరు, యాస నచ్చి ఛాన్స్ ఇస్తామని చెప్పారని ఆమె తెలిపారు.
టీవీ షోలలో పాల్గొంటానని చెబితే కుటుంబ సభ్యులు అంగీకరించలేదని చనిపోతానని బెదిరించిన తర్వాతే తన పేరెంట్స్ అంగీకరించారని ఆమె తెలిపారు.

టీవీ షోల ద్వారా మంచి గుర్తింపు దక్కడంతో తన కుటుంబ సభ్యులు కూడా సంతోషిస్తున్నారని అమె వెల్లడించారు.ఇంట్లో తాను ఏ విధంగా మాటాడతానో స్కిట్ లో కూడా అలాగే మాట్లాడాలని బుల్లెట్ భాస్కర్ అన్న చెప్పేవారని బుల్లెట్ భాస్కర్ టీమ్ లో చేయడం ద్వారా తన జీవితం మారిపోయిందని ఆమె కామెంట్లు చేశారు.సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపడం లేదని ఛాన్స్ లు వస్తున్నా వదులుకుంటున్నానని ఫైమా అన్నారు.