రానా, సాయిపల్లవి విరాటపర్వం సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించగా ఇప్పటికే విడుదలైన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సంగతి తెలిసిందే.అయితే సినిమా బాగుందని ప్రేక్షకులు చెబుతున్నా ఈ సినిమా కలెక్షన్లు చూసి ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నాయి.
మౌత్ టాక్ బాగున్నా ఈ సినిమా కలెక్షన్లు పుంజుకోకపోవడం ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఈ సినిమా రెండు రోజుల కలెక్షన్లు రెండున్నర కోట్ల రూపాయల కంటే తక్కువ మొత్తం కావడం గమనార్హం.ఈ సినిమాకు 14.50 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా నైజాంలో 82 లక్షల రూపాయలు, సీడెడ్ లో 12 లక్షల రూపాయలు, ఆంధ్రలో 59 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి.ఓవర్సీస్ లో ఈ సినిమాకు 54 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.ఇతర రాష్ట్రాల్లో ఈ సినిమాకు 20 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.ఫుల్ రన్ లో ఈ సినిమా కలెక్షన్లు 5 కోట్ల రూపాయల మార్కును దాటుతాయా? లేదా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
15 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది.అటు రానా ఇటు సాయిపల్లవి ఖాతాలో ఈ సినిమాతో ఫ్లాప్ చేరినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.రెండు రోజుల్లో కేవలం 2 కోట్ల 27 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు మాత్రమే ఈ సినిమా సాధించడం గమనార్హం.
సోలో హీరోగా రానా నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం లేదు.

ఈ సినిమా కలెక్షన్లు సాయిపల్లవి పరువు తీసేలా ఉన్నాయని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో విజయాలను అందుకున్న సాయిపల్లవికి ఈ సినిమా ఫలితం షాకిచ్చిందనే చెప్పాలి.రానా, సాయిపల్లవి మాత్రం ఈ సినిమా కలెక్షన్లు పెరగడానికి తమ వంతు కృషి చేస్తున్నారు.







