బండ్ల గణేష్ అంటే మినిమం అట్టా ఉండాలా...!

బండ్ల గణేష్‌ అంటే చాలా మంది కమేడియన్‌ గానే చూస్తారు.ఆయన స్టేజ్‌ పైకి వచ్చినప్పుడు చేసే రచ్చ కూడా దానికి ఒక కారణం అనే చెప్పాలి.

 Latest News Bandla Ganesh And Tweets, Bandla Ganesh, Bandla Ganesh Latest Tweet-TeluguStop.com

పలు ఇంటర్వ్యూల్లోనూ తన ధోరణి నవ్వు తెప్పించే విధంగానే ఉంటుంది.ఆయన వాడే భాష, డైలాగ్‌లు, సవాళ్లు నవ్వుల పూవులు పూయిస్తాయి.

కానీ ఆ బండ్ల గణేష్‌ ఈ మధ్య చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తున్నాడు.ఒకప్పుడు బండ్లన్న కనిపిస్తే మినిమం కామెడీ ఉండేది.

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే బండ్ల గణేష్.తాజాగా ట్విట్టర్లో ఓ ఆడియో పోస్టు చేశాడు.

అందులో చాలా రేర్‌ గా కనిపించే, వినిపించే బండ్లన్న వినిపించాడు.అందులో కొన్ని జీవిత పాఠాలు బోధించాడు.జీవితంలో ఎవరినీ నమ్మొద్దని అంటూ బండ్ల చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఉన్నటుండి ఆయన ఇలా జీవిత పాఠాలు బోధించం పట్ల నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

జీవితంలో ఎవరిని నమ్మవద్దని.మనల్ని మనమే నమ్ముకుందామని బండ్ల గణేష్ చెప్పాడు.

మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను నమ్ముకుందామన్నాడు.భార్యను, మనం జన్మనిచ్చిన పిల్లలను ప్రేమిద్దామని….

మనల్ని కన్న తల్లిదండ్రులకు మంచి జీవితాన్ని ఇద్దామన్నాడు.మన తల్లిదండ్రులు మన మీద కోటి ఆశలతో ఉన్నారని అన్నాడు.

మన పిల్లలకు మంచి దారి చూపిద్దామని చెప్పాడు.

ఇటీవల బండ్ల గణేష్ హీరోగా ట్రై చేశాడు.

డేగల బాజ్జీ సినిమాలో హీరోగా యాక్ట్ చేశాడు.దీనికి కొంత ప్రమోషన్ కూడా చేశాడు.

కానీ డేగల బాబ్జీ ఎప్పుడు వచ్చిందో.ఎప్పుడు పోయిందో కూడా చాలా మందికి తెలియదు.

ఆ రేంజ్ డిజాస్టర్ మూటగట్టుకున్నాడు బండ్ల గణేష్‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube