భారత సంతతి మహిళా ఆర్కిటెక్ట్‌కు బ్రిటన్‌లో కీలక పదవి.. ఎవరీ నైరితా చక్రవర్తి..?

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వలస వెళ్లిన భారతీయులు అక్కడ కీలక స్థానాల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.రాజకీయ నాయకులు, లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, సీఈవోలు, శాస్త్రవేత్తలుగా రాణిస్తున్నారు.

 Meet The Indian-origin Architect Named Commissioner Of Historic England Indian-o-TeluguStop.com

తాజాగా బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన ఆర్కిటెక్ట్‌ నైరితా చక్రవర్తికి కీలక పదవి దక్కింది.బ్రిటీష్ ప్రభుత్వ ఏజెన్సీ అయిన హిస్టారిక్ ఇంగ్లాండ్ కమీషనర్‌గా ఆమె నియమితులయ్యారు.

నైరితా చక్రవర్తి ఢిల్లీలో పుట్టి పెరిగారు.యూకేకు వెళ్లడానికి ముందు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌లో చదువుకున్నారు.

హెరిటేజ్, టౌన్‌స్కేప్, డిజైన్‌లో ఆమెకు 16 సంవత్సరాల అనుభవం వుంది.

నైరితా ఇప్పటికే హిస్టారిక్ ఇంగ్లాండ్ అడ్వైజరీ కమిటీలో సభ్యురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

జూలై 1 నుంచి 2026 జూన్ వరకు నాలుగేళ్ల పాటు ఆమె ఈ సంస్థకు కమీషనర్‌గా వ్యవహరిస్తారు.భారీ సంక్లిష్టమైన భవనాలు, టౌన్ సెంటర్ వంటి నిర్మాణాలకు డిజైన్ చేశారు.

లండన్‌లోని ప్రఖ్యాత అలెగ్జాండ్రా ప్యాలెస్, టోటెన్‌హామ్ హై రోడ్, హోల్ బోర్న్ టౌన్‌‌హాల్, మిడిల్స్ బ్రో హిస్టారిక్ డాక్‌యార్డ్స్ వంటి వాటికి నైరిత పనిచేశారు.తన నియామకంపై నైరితా చక్రవర్తి స్పందిస్తూ.

తనకు స్పూర్తిగా నిలుస్తూ, మార్గనిర్దేశం చేసిన సహోద్యోగులతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నానని తెలిపారు.

Telugu England, Englandadvisory, India, Indianorigin-Telugu NRI

నైరిత తండ్రి శాస్త్రవేత్త కాగా.తల్లి రచయిత, వీరిద్దరూ ఢిల్లీలోనే నివసిస్తుండగా తమ్ముడు కోల్‌కతాలో వుంటున్నాడు.ప్రయాణం అనేది తన బాల్యంలో ఒక ముఖ్యమైన భాగమన్నారామె.

భారతదేశ వారసత్వ సంపదను స్వయంగా చూసేందుకు ఇది ఎంతగానో తోడ్పడిందని నైరిత అన్నారు.అన్నట్లు ఇటీవలే ఆమె సొంతంగా ఆర్కిటెక్ట్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube