అయ్యన్నపాత్రుడు ఇంట్లో లేని సమయంలో నర్సీపట్నంలోని ఆయన ఇంట్లో పోలీసులు అరాచకం సృష్టించారు.వేకువన 3 గంటలకు నిద్రపోతున్న కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తూ పోలీసులు, రెవెన్యూ అధికారులు వెళ్లి ఇల్లు పగలగొడతారా ఏమనుకుంటున్నారు.
ఎవరిర్చారు మీకీ అధికారం.రూలింగ్ లో ఉంటే ఏమి చేసినా చెల్లిపోతుందనుకుంటున్నారా శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులను గూండాలుగా వాడుకుంటారా.
నిండు అసెంబ్లీలో సీఎం జగన్ రెడ్డి సమక్షంలోనే మా నాయకులు, వారి కుటుంబాల గురించి, నెల్లూరులో మా గురించి అసభ్యంగా మాట్లాడితే మీకు సప్త స్వరాలలా వినిపించాయా మీరు వాడిన భాషలో మా అయ్యన్నపాత్రుడు కేవలం ఒక్క శాతం వాడితేనే ఈ రోజు ఇల్లు ధ్వంసానికి పూనుకుంటారామొన్నేమో ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి వచ్చారు.నిన్న మంగళగిరి పార్టీ జాతీయ కార్యాలయంపై పట్టపగలే దాడి చేశారు.
ఈ రోజు ఏకంగా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడి ఇల్లు ధ్వంసం చేస్తున్నారు.
గుడివాడకు గోవా కల్చర్ తీసుకొచ్చిన వారిపై నో యాక్షన్…పార్టీ కార్యాలయంపై పబ్లిక్ దాడి చేసి విధ్వంసం సృష్టించిన వారిపై నో యాక్షన్భారతదేశ వ్యాప్తంగా పౌరులకు ఉన్న హక్కులు ఏపీలోని మాకు లేవు.
మాపైనే దాడులు చేసి తిరిగి మాపైనే కేసులు పెడుతున్నారు.ఏనాడు కేసుల ముఖమెరగని నాపై ఆరు కేసులు బనాయించారు ఇన్ని పాపాలు చేస్తున్న మిమ్మల్ని ఇక దేవుడు కూడా క్షమించరు సీఎం అయినంత మాత్రాన చట్టాలు చేతుల్లోకి తీసుకుంటే కుదరదని గుర్తుంచుకోండి మీ అక్రమ కేసులు, అరాచకాలతో మాలో కూడా ఓర్పు నశించిపోతోంది.
ఇష్టానుసారం రౌడీ రాజ్యం సాగిస్తామంటే చూస్తూ ఊరుకోం.







