జబర్దస్త్ ద్వార ఎంతో మంది కమెడియన్లుగా బాగా ఫేమస్ అయ్యారు.ఈ మధ్య కాలంలో లేడి కంటెస్టెంట్ లు కూడా బాగా పాపులర్ అయ్యారు.
అలాంటి వారిలో వర్ష కూడా ఒకరు.జబర్దస్త్ లో వర్ష , ఇమ్మాన్యుయేల్ మద్య నడిచే లవ్ ట్రాక్ వల్ల వీరిద్దరూ బాగా ఫేమస్ అయ్యారు.
జబర్దస్త్ లో ఇలాంటి ట్రాక్ లకు కొదవ లేదు.ఇలా జబర్ధస్త్ వల్ల బాగా ఫేమస్ అయిన జంటల్లో సుధీర్, రష్మి జంట కూడా ఒకరు.
వీరి తర్వాత మరీ అంతలా పాపులర్ అయిన జంటల్లో వర్ష,ఇమ్మానియేల్ జంట కూడా ఒకటి.
జబర్దస్త్ స్టేజి మీద వీరిద్దరి మద్య ఉండే రిలేషన్ వల్ల వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, భవిష్యత్తులో పెళ్లి కూడ చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
దీనికి తోడు ప్రతీ వారం జబర్ధస్త్ లో వీరు చేసే స్కిట్ ల వల్ల కూడా ఈ వార్తలు నిజమని నమ్ముతున్నారు.తాజాగా మళ్లీ వారం ప్రసారం కాబోయే ఎక్స్ట్రా జబర్ధస్త్ ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమో విడుదల అయ్యింది.
ఈ ప్రోమోలో వర్ష చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారనే వార్తలకు మరింత ఆజ్యం పోశాయి.ఇప్పటికే వీరిద్దరూ జబర్ధస్త్ స్టేజి మీద పలుమార్లు పెళ్ళి చేసుకున్నారు.

ఇక వచ్చేవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో వర్ష ఏకంగా ఇమ్మాన్యుయేల్ ఇంటికి కోడలిగా వెళతానని చెప్పి అక్కడున్న వారితో పాటు ప్రేక్షకులకు కూడా షాక్ ఇచ్చింది.ఇక ఈ క్రమంలో ఇంద్రజ మాట్లాడుతూ.మీరిద్దరూ ఇంతగా ఇష్టపడుతున్నారు కదా ? ఎప్పుడైనా ఇద్దరిమద్య మనస్పర్థలు వచ్చాయా అని అడిగారు.అందుకు సమాధానంగా వర్ష మాట్లాడుతూ.ఇమ్మాన్యుయేల్ గురించి ఎన్ని పుకార్లు వచ్చినా కూడా నేను పట్టించుకోను.ఇమ్మాన్యుయేల్ అంటే నాకు చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది.ఇక స్కిట్ చివర్లో వర్ష మీ అమ్మకు చెప్పు ఇంటికి కోడలు వస్తుందని చెప్పింది.
ఆ డైలాగ్ తో ఆమె ఇమ్మాన్యుయేల్ తో పెళ్ళికి సిద్ధమని క్లూ ఇచ్చింది.వర్ష ఇలా చెప్పటంతో అక్కడున్న వారందరూ ఇద్దరికీ కంగ్రాట్స్ చెప్పారు.







