జబర్దస్త్ కార్యక్రమంలో సీనియర్ కమెడియన్ అప్పారావు తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేశారు.అయితే కొన్ని కారణాల వల్ల ఆయన ఈ కార్యక్రమం నుంచి తప్పుకొని ప్రస్తుతం స్టార్ మాలో కామెడీ స్టార్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
అయితే ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న అప్పారావు జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకోవడానికి కారణం బుల్లెట్ భాస్కర్ అని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.ఈ క్రమంలోనే తాజాగా ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమంలో భాగంగా జడ్జి ఇంద్రజ టీం లీడర్లను కొన్ని రకాల ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు రాబట్టారు.
ఈ క్రమంలోనే ఇంద్రజ బుల్లెట్ భాస్కర్ ని ప్రశ్నిస్తూ సీనియర్ కమెడియన్ అప్పారావు మీ వల్లనే ఈ కార్యక్రమం నుంచి తప్పకున్నారనే వాదన వినపడుతుంది.దీనిపై మీ సమాధానం ఏంటి అని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు బుల్లెట్ భాస్కర్ సమాధానం చెబుతూ ఈ ప్రశ్నకు ఎక్కడ సమాధానం చెప్పకూడదు అని అనుకున్నాను అయితే ప్రస్తుతం చెప్పాల్సిన సమయం వచ్చింది అంటూ నోరు విప్పారు.

జబర్దస్త్ వేదికపై ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అని నిర్ణయించేది నేను కాదు.స్కిట్ లో ఛాన్స్ కూడా నేను ఇవ్వలేను.స్క్రిప్టు ప్రకారం ఎవరికి ఎన్ని డైలాగ్స్ వస్తే అని చెప్పాల్సి ఉంటుంది.స్క్రిప్టుకి అనుగుణంగానే పాత్రలు ఉంటాయి.నా స్కిట్ లో నాకే ఎక్కువ డైలాగ్స్ ఉండవు ఎందుకంటే నేను అంత పెద్ద ఫర్ఫార్మెన్స్ కూడా కాదు అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
ఇక పోతే తాను ఎప్పుడూ కూడా అప్పారావుని కించపరచలేదని, అతనిని తక్కువ చూపు చూడలేదని బుల్లెట్ భాస్కర్ తెలిపారు.ఇప్పటికీ ఆయన నా గురించి అలా చెబితే అది నేను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను.
ఆయన అన్న విధంగానే మనం మాట్లాడితే అతనికి మనకి పెద్ద తేడా ఉండదు అంటూ బుల్లెట్ భాస్కర్ అప్పారావు ఈ కార్యక్రమం నుంచి పెళ్లి పోవడానికి తాను ఏమాత్రం కారణం కాదని ఈ సందర్భంగా వెల్లడించారు.







