కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో ఈయన ఎంతో సంతోషంలో ఉన్నారు.గత నాలుగు సంవత్సరాల నుంచి బాక్సాఫీస్ వద్ద ఒక్క హిట్ కూడా లేకపోవడంతో కమల్ హాసన్ ఎంతో సతమతమయ్యారు.
ఈ క్రమంలోనే లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో కమల్ హాసన్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టగా కమల్ హాసన్ సంతోషంలో ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో పెద్ద ఎత్తున కానుకలను అందిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో నటుడు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించగా రోలెక్స్ సర్ పాత్రలో సూర్య ఎంట్రీ సినిమాకి హైలెట్ అయ్యింది.మొత్తానికి చాలా కాలం తర్వాత మంచి విజయాన్ని అందుకున్న కమల్ హాసన్ ఈ సినిమా విజయవంతం కావడంతో పెద్ద ఎత్తున సక్సెస్ మీట్ నిర్వహించారు.

ఈ సక్సెస్ మీట్ అనంతరం కమల్ హాసన్ థియేటర్ ఓనర్స్, డిస్ట్రిబ్యూటర్లకు, చిత్ర బృందానికి, మీడియా ప్రతినిధులకు పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేశారు.వివిధ రకాల ఆహార పదార్థాలతో కమల్ హాసన్ విందు భోజనాలు ఏర్పాటు చేశారు.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున వీరందరూ ఈ విందు కార్యక్రమంలో పాల్గొని కమల్ హాసన్ కి కృతజ్ఞతలు తెలిపారు.ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు అవుతున్నాయి.
ఇక ఈ సినిమా మంచి విజయం కావడంతో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పేరు పెద్ద ఎత్తున మార్మోగిపోతోంది.








