నిజానికి చంద్రబాబు అధికారంలో ఉంటే తమకు దర్శన బాగ్యం కూడా ఉండదని కార్యకర్తలు అనేమాట.సీఎంగా బాబు ఉంటే ఆయనను కలిసేందుకు మంత్రులకు అపాయింట్ మెంట్ దొరకదని అంటుంటారు.
ఇక కార్యకర్తలను అయితే అస్సలే పట్టించుకోరు అన్న విమర్శలు కూడా ఉన్నాయి.అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా బాబు వ్యవహరిస్తున్నారు.
స్వయంగా కార్యకర్తలతో ఫోన్లు మాట్లాడుతున్నారు.కార్యకర్తలను వెంటబెట్టుకుని ప్రజల్లో తిరుగుతూ అందరినీ పలకరిస్తున్నారు.గతంలో గతంలో అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోని అధికారం మారగానే దగ్గరవుతారనే విమర్శ ఉన్నప్పటికీ ఈ సారీ అలా కాదంటున్నారు బాబు.
2019 తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చాక నేరుగా కార్యకర్తలతో ఫోన్-ఇన్ కార్యక్రమాలు చేపడుతున్నారంట.రెగ్యూలర్ గా క్షేత్ర స్థాయిలో ఉండే సామాన్య కార్యకర్తలతో మాట్లాడుతున్నారని తెలుస్తోంది.అయితే అధినేతలో వచ్చిన మార్పు చాలా మంచిదే అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.మరి ఈ మార్పు శాశ్వతంగా ఉంటుందా.మళ్లీ అధికారం రాగానే పాత పద్దతినే అవలంభిస్తారా అనే అనుమానం కూడా ఉంది.
అందుకే బాబు తన పంతా మార్చుకుని తెలుగు తమ్ముళ్లకు భరోసా ఇస్తున్నారు.పార్టీని నిలబెట్టడానికి కావాల్సింది కార్యకర్తలేనని బడా బాబులు కాదని తెలివచ్చినట్టుంది.
అధికారంలో ఉన్నప్పుడు బాబు చుట్టూ బడా బాబులు చేరి తమ పనులు చేయించుకుని అధికారం లేనప్పుడు మాత్రం పట్టించుకునేవారు కాదు.అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు ప్రజలు, కార్యకర్తలతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు.
తమ అధినేతలో వచ్చిన మార్పుకు తెలుగు తమ్ముళ్లు ఖుషీ అవుతున్నారు.మళ్లీ ఇప్పుడు టీడీపీకి మంచి బూస్ట్ ఇస్తోంది కూడా కింది స్థాయి కార్యకర్తలే అని చెప్పాలి.
దీంతో బాబు కష్టం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి.మళ్లీ టీడీపీకి పూర్వ వైభవం తేవడానికి బాబు సంకల్ప బలం, కార్తకర్తల పట్టుదలే అని చెప్పాలి.
అయితే అధికారం రాగానే బాబు చుట్టూ అడ్డుగోడలా కొన్ని శక్తులు చేరిపోతున్నాయని పార్టీ క్యాడర్ లో అసంతృప్తి ఉండేది.గతంలో చాలా చోట్ల కనీసం నామినేటెడ్ పదవులు కూడా క్యాడర్ కి దక్కలేదనే అపవాదు కూడా ఉంది.ఇప్పుడు అవన్నీ చెరిపివేయడానికి బాబు ఈ సారి అధికారంలోకి వస్తే క్యాడర్ కే పెద్దపీట వేస్తామని ఉమ్మడి విశాఖ జిల్లా టూర్లో బాబు ఎమోషనల్ అయ్యారు.ఈ సారి అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటానని.
కష్టపడి పనిచేసినవారికే పదవులని గట్టిగానే చెబుతున్నారు.ఇక తెలుగు తమ్ముళ్లు కూడా బాబుని అర్థ చేసుకున్నట్లు కనిపిస్తోంది.
కేవలం బాబు కోసమే వారు పార్టీ జెండా మోస్తున్నారన్నది కూడా నిజం.మొత్తానికి బాబు పార్టీ క్యాడర్ విషయంలో తప్పులు గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు.