కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ విధానాన్ని నిరసిస్తూ దేశంలో పలు రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి.ఈ క్రమంలో తెలంగాణ, బీహార్, యూపీ లలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే రీతిలో రైల్వే స్టేషన్ లని లక్ష్యంగా చేసుకుని ఆందోళనకారులు విధ్వంసం సృష్టిస్తున్నారు.
నిన్న బీహార్ లో లఖీసరాయ్ రైల్వే స్టేషన్ తాజాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్మీ స్టూడెంట్స్ రణరంగం సృష్టించారు.సికింద్రాబాద్ లో స్టాల్స్ పగలగొట్టి రైళ్లకి నిప్పంటించారు.
దాదాపు 20 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లే రీతిలో వ్యవహరించినట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఇంకా ఆందోళన కారులు నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు.
పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి పోలీసులు కాల్పులు జరపగా ఓ నిరసనకారుడు మృతి చెందాడు.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద పరిస్థితి చాలా ఉధృతంగా ఉంది.ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.ఈరోజు ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకున్న ఘటనలు దురదృష్టకరం అని అన్నారు.
“అగ్నిపథ్” ఆర్మీ రిక్రూట్మెంట్ ఈ ప్రక్రియపై చేపట్టిన నిరసనల హోరులో జరిగిన సంఘటనలు ఆవేదన కలిగించాయని చెప్పుకొచ్చారు.పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన యువకుడు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాట్టు పవన్ తన ప్రకటనలో తెలియజేశారు.
ఇక ఇదే సమయంలో గాయపడిన వారు త్వరగా కోలుకునే రీతిలో ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని కోరారు.







