కావలసినంత కాదు కావాల్సిందానికంటే కాస్త ఎక్కువే అందం అభినయం ఆమె సొంతం.ఆ హీరోయిన్ పేరు చెబితే చాలు ప్రేక్షకులు అందరూ పగటి కల లోకి వెళ్లేవారు.
ఇక హీరోలు అయితే మా సినిమాలో ఆ హీరోయినే కావాలి అంటూ పట్టుబట్టి మరీ అవకాశాలు ఇచ్చే వారు.అంతలా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే కొందరు దర్శక నిర్మాతలు హీరోలు ప్రేక్షకులను ఆకర్షించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఆమె.ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో అనుకుంటున్నారు కదా.నిన్నటితరం హీరోయిన్ నగ్మా. సౌత్ ఇండస్ట్రీ లో దాదాపు దశాబ్దకాలం పాటు తిరుగులేని స్టార్ హీరోయిన్ గా హవా నడిపించింది.
1974 డిసెంబర్ 25వ తేదీన జన్మించిన ఈ ముద్దుగుమ్మ మోడల్ గా తన కెరీర్ స్టార్ట్ చేసింది.ఇక ఆ తర్వాత దర్శక నిర్మాతల కంటపడింది.దీంతో బాలీవుడ్లో పలు సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ.వెంటనే టాలీవుడ్ కు సెట్ అయిపోయింది.ఇక్కడ మాత్రం నక్క తోక తొక్కి వచ్చింది.
అందుకే ఈ అమ్మడికి అదృష్టం జిడ్డులా పట్టేసింది.దీంతో ఇక వరుస అవకాశాలు రావడం.
చేసిన సినిమాలు సూపర్ హిట్ కావడం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది స్టార్లతో జతకట్టింది.అయితే 38 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు.
ప్రస్తుతం రాజకీయాల్లో ఉంటూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు నగ్మా.అయితే నగ్మా ఇంకా పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

అయితే నగ్మా ప్రేమలో విఫలం కావడమే ఆమె పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అన్నది తెలుస్తోంది.ఒక్కసారి కాదు నాలుగు సార్లు ఈ అమ్మడు ప్రేమలో విఫలమైందట.కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ ను ప్రేమించింది.అప్పటికే ఆయనకు పెళ్లి అయ్యి పిల్లలు కూడా ఉన్నారు.కానీ ఆ తర్వాత ఆయనకు దూరమై భోజపురి హీరోలు మనోజ్ తివారి, రవి కిషన్ తో ప్రేమలో మునిగి తేలింది.వీరిద్దరితో కూడా రిలేషన్షిప్ ని వదిలేసుకుంది.
మనోజ్ తివారి కి కూడా అప్పటికే పెళ్ళై పిల్లలు కూడా ఉండటం గమనార్హం.

ఇక చివరగా నగ్మా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తో కూడా ప్రేమలో మునిగి తేలింది.తనకంటే గంగూలీ చిన్నవాడు అయినా నగ్మా ప్రేమ మాత్రం ఆపలేదు.కానీ తర్వాత కొన్నాళ్ళకి మనసు మార్చుకున్న గంగూలి మరొకరిని పెళ్లి చేసుకున్నాడు.
దీంతో నగ్మా ఒంటరయిపోయింది.ఇక అప్పటి నుంచి నగ్మా కు పెళ్లిపై ఆసక్తి పోయిందని అందుకే పెళ్ళి చేసుకోకుండానే ఉంది అని తెలుస్తోంది.








