మీరు బాధ్యత గల పౌరులా.రూల్స్ బ్రేక్ చేసే వారిని శిక్షించాలని అనుకుంటున్నారా.
అయితే మీకొక ఒక గుడ్ న్యూస్.భవిష్యత్తులో భారత ప్రభుత్వం బాధ్యతగల పౌరులకు రూ.500 చొప్పున బహుమతి ఇచ్చేలా ఓ చట్టం తీసుకు రాబోతోంది.ఇందుకు వారు చేయాల్సిందల్లా నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ చేసిన వాహన ఫొటో ప్రభుత్వానికి పంపించడమే.
అలా రాంగ్ పార్కింగ్ చేసిన ఒక్కొక్క వాహనం ఫొటోకి మీరు 500 రూపాయలు బహుమతిగా పొందొచ్చు.ఇలాంటి ఒక చట్టం తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు తాజాగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.
సాధారణంగా భారతదేశంలోని రోడ్లు, వీధులు, రహదారులు చాలా రద్దీగా ఉంటాయి.అయితే ఇలాంటి ప్లేసుల్లో కొందరు ప్రజలు ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేస్తుంటారు.
దీనివల్ల అందరికీ ఇబ్బందులు ఎదురవుతుంటాయి.ఈ రాంగ్ పార్కింగ్ సమస్య రోజు రోజుకీ మరింత తీవ్రతరం అవుతోంది.
ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రజలను కూడా భాగస్వామ్యం చేసుకోవాలని యోచిస్తోంది.

నితిన్ గడ్కరీ జులై 16న రాజధాని ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇందులో భాగంగా మాట్లాడుతూ… ఫొటోలో ఉన్న వెహికల్‌కు రూ.1000 ఫైన్ విధించనున్నట్లు తెలిపారు.అయితే ఎవరైతే ఈ ఫొటోని పంపుతారో వారికి రూ.500 ఇవ్వనున్నట్లు తెలిపారు.రోడ్లపై యధేచ్ఛగా వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల తరచూ ట్రాఫిక్ రద్దీ సమస్యలు ఎక్కువ అవుతున్నాయని.అందుకే ఈ సమస్యకు పరిష్కారంగా ఈ చట్టం తీసుకురావాలని యోచిస్తున్నట్లు వివరించారు.ఈ చట్టం అమల్లోకి వస్తే రాంగ్ ప్లేస్ లో పార్కింగ్ చేసిన బండి ఫోటో తీసే రూ.500 గెలుచుకోవచ్చు.అలాగే ట్రాఫిక్ రద్దీ వంటి సమస్యను అరికట్టడంలో సహాయపడవచ్చు.







