బాదములతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేళ మీ ఆరోగ్య లక్ష్యాలను చేరుకోండి !

ఇండియా, 15 జూన్‌ 2022 : అత్యంత ప్రాచీనమైన వ్యాయామ రూపం యోగా.భారతదేశంలో ఐదు వేల సంవత్సరాల క్రితమే యోగా పుట్టినది.శారీరక, మానసిక, భావోద్వేగ సంక్షేమానికి ప్రతిరూపంగా యోగా కీర్తించబడుతుంది.ప్రతి రోజూ యోగాను ఆచరించడం తో పాటుగా సమతుల ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యం మరియు సంక్షేమం సాధ్యమవుతుంది.

 Achieve Your Health Goals This International Yoga Day With Almonds , Yoga Day ,-TeluguStop.com

అంతర్జాతీయ యోగా దినోత్సవంను ప్రతి సంవత్సరం 21 జూన్‌ న నిర్వహిస్తున్నారు.తద్వారా , మరింత స్పృహ, ఆలోచన్మాక జీవనం చుట్టూ అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్నారు.

యోగా దినోత్సవం సమీపిస్తోన్న వేళ, యోగా అభ్యసించడంతో పాటుగా ఆరోగ్యం, పౌష్టికాహార డైట్‌కు తగిన తోడ్పాటును పొందవచ్చు.డైట్‌తో ఓ గుప్పెడు బాదములు జోడించడమనేది ఆరోగ్యవంతమైన ప్రయాణానికి తొలి అడుగు.

ఇవి పౌష్టికాహార స్నాకింగ్‌ అవకాశంగా నిలువడంతో పాటుగా గుండె ఆరోగ్యం, మధుమేహం, బరువు నిర్వహణ, చర్మ ఆరోగ్యంకు ప్రయోజనాలు కలిగిస్తాయి.బాదములలో జింక్‌, ఐరన్‌, విటమిన్‌ ఈ వంటివి ఉంటాయి.

ఇవి రోగ నిరోధక శక్తికి తోడ్పడతాయి.వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ –న్యూట్రిషన్‌ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ ‘‘కార్డియోవాస్క్యులర్‌ వ్యాధులతో ఇబ్బంది పడే రోగులు యోగా అనుసరించడంతో పాటుగా ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్లు ప్రయోజనకరంగా ఉంటాయి.

యోగాతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.దానితో పాటు రక్త ప్రసరణ కూడా సరిగా జరుగుతుంది.

అదనంగా, ప్రతి రోజూ బాదములను తీసుకుంటూ యోగా ప్రక్రియను అనుసరిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది.

క్లీనికల్‌ అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం గుండె వ్యాఽధుల ప్రమాదాన్ని తగ్గించడంలో బాదములు ఎంతగానో సహాయపడుతున్నాయి.

ఇటీవల యుకెలో జరిగిన ఓ అధ్యయనంలో సాధారణ స్నాక్స్‌కు బదులుగా బాదములు తీసుకోవడం వల్ల హార్ట్‌ రేట్‌ వేరియబిలిటీ (హెచ్‌ఆర్‌వీ) మెరుగుపడటంతో పాటుగా మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుందని తేలింది.పర్యావరణ మరియు మానసిక సవాళ్లను స్వీకరించడంలో హృదయం ఎంత మేరకు స్వీకరిస్తుందనేదానికి ఇది కీలక సూచిక.

మందగించిన హెచ్‌ఆర్‌వీతో కార్డియో వాస్క్యులర్‌ వ్యాధులు కూడా అనుసంధానితమై ఉండటంతో పాటుగా కార్డియాక్‌ మరణాలకూ కారణమవుతుంది’’అని అన్నారు.సుప్రసిద్ధ టెలివిజన్‌ మరియు సినీ నటి నిషా గణేష్‌ మాట్లాడుతూ ‘‘నా సమగ్రమైన వెల్‌నెస్‌ ప్రక్రియలలో కొన్ని రకాల వ్యాయామాలు అనుసరించడం ఉంటుంది.

దానిలో యోగా నాకు అత్యంత ఇష్టమైన ప్రక్రియ.మనసు ప్రశాంతంగా ఉంచడంలో యోగా సహాయపడుతుంది.

ఒకరి శరీరం సౌకర్యవంతంగా వంచడంలోనూ అది సహాయపడుతుంది.దీనితో పాటుగా మనం తీసుకునే ఆహారం కూడా ఆరోగ్యవంతమైనది ఉండాలని కోరుకుంటుంటాను.

మనసు, శరీరంకు తగిన పోషకాలను అందించడంలో ఆహారం అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది.ఆరోగ్యవంతమైన, సమతుల హారం తీసుకోవడంతో పాటుగా పౌష్టికాహారం అయినటువంటి బాదములు కూడా తీసుకుంటుంటాను.

ఇవి రోజంతా పూర్తి శక్తివంతంగా నిలిచి ఉండటంలో తోడ్పడతాయి.బాదములలో విటమిన్‌ ఈ, ప్రొటీన్‌ తో ఇతర కీలక పోషకాలు అధికంగా ఉంటాయి.

అందువల్ల నా డైట్‌లో వీటిని జోడించుకోవడాన్ని ఓ అలవాటుగా మార్చుకున్నాను’’అని అన్నా

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube