సింగపూర్‌ : ప్రముఖ భారత సంతతి ప్రాసిక్యూటర్ జి.కన్నన్ కన్నుమూత

సింగపూర్‌లోని భారత సంతతి కమ్యూనిటీలో విషాదం చోటు చేసుకుంది.ప్రముఖ ప్రాసిక్యూటర్ జి.

 Singapore’s Veteran Indian-origin Prosecutor G Kannan Passes Away , Singapo-TeluguStop.com

కన్నన్ కన్నుమూశారు.ఆయన వయసు 52 సంవత్సరాలు.

పూర్తి పేరు జ్ఞానసిహమణి కన్నన్.ఆయన మరణ వార్తను అటార్నీ జనరల్ ఛాంబర్స్ (ఏజీసీ) బుధవారం ప్రకటించింది.

ఒక ప్రమాదంలో కన్నన్ మరణించినట్లు తెలిపిన ఏజీసీ.అందుకు గల కారణాలు, ప్రమాదం ఎక్కడ జరిగిందన్న వివరాలను మాత్రం చెప్పలేదు.

జి.కన్నన్ ఏజీసీ క్రైమ్ విభాగంలో సీనియర్ డైరెక్టర్, సీనియర్ స్టేట్ కౌన్సెల్‌గా వ్యవహరిస్తున్నారు.

1995లో ఏజీసీలో చేరిన ఆయనకు ప్రాసిక్యూటర్‌గా 20 ఏళ్లకు పైగా అనుభవం వుంది.అంతేకాదు ఐదేళ్ల పాటు సింగపూర్ మానవశక్తి మంత్రిత్వ శాఖలోనూ కన్నన్ పనిచేశారు.

ఆర్ధిక సంస్థలను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చమురు వ్యాపార సంస్థ హీన్ లియోంగ్ ట్రేడింగ్ వ్యవస్థాపకుడు లిమ్ ఊన్ కుయిన్‌కు కన్నన్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించారు.ఈ ఏడాది ప్రారంభంలో ఆండ్రూ గోస్లింగ్ కేసును విచారించి వార్తల్లో నిలిచారు.

సింగ్‌హెల్త్ పేషెంట్ డేటాబేస్‌పై జరిగిన సైబర్ దాడిని పరిశీలించిన 2018 కమిటీ ఆఫ్ ఎంక్వైరీ సమయంలో సాక్ష్యాలను అందించిన ఏజీసీ బృందంలో కన్నన్ కూడా సభ్యుడే.ఇటీవల ఆయనకు ఏజీసీ వాణిజ్య , సాంకేతిక నేరాల క్లస్టర్‌లో పోస్టింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.2018లో ఆయన నేషనల్ డే అవార్డ్స్‌లో భాగంగా లాంగ్ సర్వీస్ మెడల్‌ను అందుకున్నారు.కన్నన్ ఆకస్మిక మరణం పట్ల సింగపూర్‌లోని న్యాయవాద సంఘం సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా న్యాయవాదిగా ఆయన చేసిన సేవలను వారు గుర్తుచేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube