రెండేళ్ల పిల్లాడి కోసం ఆయాను పెడ్తే.. ఆమె చేసిన నిర్వాకం ఏంటో తెలుసా!

అప్పుడప్పుడే మాటలు నేర్చుకొని.అమ్మా, తాత, అత్త అటూ హాయిగా గడపాల్సిన ఆ చిన్నారి గొంతు కొంత కాలంగా మూగబోయింది.

 Maid Harrased Two Year Old Boy At Jabalpur , Aaya Beated Two Year Old Boy , Aa-TeluguStop.com

అయితే బాబు రోజురోజుకూ సన్నగా అయిపోతున్నాడు.అమ్మ ఒడిలో హాయిగా ఆడుకునే ఆ రెండేళ్ల చిన్నారి ఒంటరిగా గడుపుతున్నాడు.

అయితే బాబులో వచ్చిన మార్పును చూసి ఆ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.ఏం జరుగుతుందో తెలియక వైద్యుడిని సంప్రదించారు.

డాక్టర్ చెప్పిన మాటలు విని షాక్ కు గురయ్యారు.

అయితే మధ్య ప్రదేశ్ లోని జబల్ పూర్ కు చెందిన దంపతులకు రెండేళ్ల బాబు ఉన్నాడు.

ఇద్దరికీ ఉద్యోగాలు ఉండడం.బాబు కోసం ఉద్యోగం మానేస్తే ఇళ్లు గడవని పరిస్థితి కావండతో… బాబు కోసం ఓ ఆయాను పెట్టారు.

ఆమెకు నెలకు 5 వేల రూపాయల డబ్బును కూడా ఇస్తున్నారు.రోజంతా ఉద్యోగ పనుల్లో తలమునకలవుతున్నారు.

అయితే బాబుని చూస్కునేందుకు కష్టమై ఆ ఆయా… బాబు ఏడుస్తున్నప్పుడల్లా కొట్టడం చేస్తుండేది.ఇష్టం వచ్చినట్లుగా కొట్టడంతో బాబు చాలా గాయపడ్డాడు.

మానసికంగాను అనారోగ్యం పాలయ్యాడు.

Telugu Aaya Boy, Aaya, Child, Maid-Latest News - Telugu

అయితే బాలుడి పరిస్థితి చూసిన తల్లిదండ్రులు వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా….చిన్నారి శరీరంలో అంతర్గత అవయవాలకు వాపు వచ్చిందని చెప్పారు.ఇది విన్న తల్లిదండ్రులు ఇంటికి వెళ్లి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు.

అందులో చూసిన దృశ్యాలు చూసి ఉలిక్కిపడ్డారు.పసిపిల్లాడనే ఇంగితం కూడా లేకుండా ఆమె కొట్టడం చూసి.

పోలీసులకు అప్పగించారు.సాక్ష్యాలతో సహా అప్పగించగా.

ఆయాపై పలు సెక్షన్ల కింద కేసు పెట్టి ఆమెను అరెస్ట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube