రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో గౌరీ రోనంకి డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా పెళ్లిసందడి.శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన ఈ సినిమాలో కన్నడ భామ శ్రీ లీల హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాతో అమ్మడు తెలుగు తెరకు పరిచయమైంది.ప్రస్తుతం శ్రీ లీల వరుస తెలుగు సినిమాలతో సత్తా చాటుతుంది.ఆల్రెడీ మాస్ మహరాజ్ రవితేజ హీరోగ్గా వస్తున్న ధమాకా సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఈ అమ్మడు లేటెస్ట్ గా మరో క్రేజీ ఆఫర్ అందుకున్నట్టు తెలుస్తుంది.
జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పొలిశెట్టి సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
కళ్యాణ్ శంకర్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు టైటిల్ గా అనగనగా ఒక రాజు అని ఫిక్స్ చేశారు.ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.
పెళ్లిసందడి యావరేజ్ గా నిలిచినా సరే శ్రీ లీలకు మాత్రం వరుస అవకాశాలు వస్తున్నాయి.ఈ సినిమాలతో శ్రీ లీల తప్పకుండా టాలీవుడ్ లో తన సత్తా చాటుతుందని చెప్పొచ్చు.
ప్రస్తుతం మీడియం రేంజ్ హీరోలు యువ హీరోలతో నటిస్తున్న్న అమ్మడు స్టార్ సినిమా ఛాన్సుల కోసం వెయిట్ చేస్తుంది.







